జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-04-06T03:46:29+05:30 IST

భారత ఉప ప్రధాని దివం గత బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జగ్జీవన్‌రామ్‌ జయం తిని నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభాసింగ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ ఓదెలు, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావులతో కలిసి జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి
బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 5: భారత ఉప ప్రధాని దివం గత బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జగ్జీవన్‌రామ్‌ జయం తిని నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభాసింగ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ ఓదెలు, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావులతో కలిసి జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ ఒక సామాజిక శక్తి అని, ఆయన అనుసరించిన విధానాలు, జీవితం, ఆశయాలను తెలుసుకోవాల న్నారు.  రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు ఉన్నా యని, పేద, ధనిక, దళితులు, అగ్రవర్ణాలు లాంటి వ్యత్యాసం లేదని తెలిపారు.  జిల్లా కేంద్రంలో  జగ్జీవన్‌రామ్‌  విగ్రహం ఏర్పాటుతోపాటు కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు వెంకటేష్‌, అంబేద్కర్‌ సంక్షేమ సంఘం అధ్య క్షుడు కాటం రాజేష్‌, హరికృష్ణ, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు దశర ధం, మాలమహానాడు నాయకులు చరణ్‌, సాం ఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గా ప్రసాద్‌ పాల్గొన్నారు. 

 హాజీపూర్‌: పడ్తన్‌పల్లి పంచాయతీ ఆవరణలో  బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. ఎమ్మె ల్యే  దివాకర్‌రావు హాజరై జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.   

Read more