మండలాలల్లో ఉత్సాహంగా ఆటల పోటీలు

ABN , First Publish Date - 2022-08-18T04:11:50+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం తిర్యాణి, దహెగాం, చింతలమానేపల్లి, పెంచికలపేట మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు మండలస్థాయి క్రీడాపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

మండలాలల్లో ఉత్సాహంగా ఆటల పోటీలు
కౌటాలలో ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

తిర్యాణి/దహెగాం/చింతలమానేపల్లి/పెంచికలపేట/సిర్పూర్‌ (టి)/కెరమెరి/వాంకిడి/కౌటాల, ఆగస్టు 17: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం తిర్యాణి, దహెగాం, చింతలమానేపల్లి, పెంచికలపేట మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు మండలస్థాయి క్రీడాపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తిర్యాణిలో పోటీలను ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ చంద్రశేఖర్‌, చింతలమానే పల్లిలో ఎంపీపీ నానయ్య, పెంచికల పేటలో ఎస్సై రామన్‌కుమార్‌, కౌటాలలో ఎంపీపీ విశ్వనాథ్‌, ఎంఈవో హన్మంతు, సర్పంచ్‌ మౌనీష్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రాంచంద్రనాయక్‌, హెచ్‌ఎంరమేష్‌ తదితరులు పోటీలను ప్రారంభించారు. చదువుతోపాటు విద్యా ర్థులు ఆటల్లోనూ రాణించాలన్నారు. సిర్పూర్‌(టి) సాంఘిక గురుకుల పాఠశాలలో ఎంపీడీవో రాజేశ్వర్‌, ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి, ఎంపీ టీసీ సోహెల్‌ అహ్మద్‌ క్రీడాపోటీలను పోటీలు ప్రారంభించారు. గెలుపొం దిన వారికి జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. కెరమెరిలో క్రీడల్లో గెలుపోట ములు సహజమని ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ దృపతా బాయి అన్నారు. క్రీడాపోటీ ల్లో గెలు పొందిన క్రీడాకారు లకు బహుమతులు ప్రదానం చేశారు. వాంకిడి మండలంలోని పాఠ శాలల విద్యార్థులకు ఇందాని గ్రామంలో బుధవారం క్రీడాపోటీలను నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంఈవో మనుకుమార్‌, మండల క్రీడాపోటీల కన్వీనర్‌ రాథోడ్‌ సుభాష్‌ అభినందించారు.

Read more