ఇళ్ల పట్టాలతో పేదలకు భరోసా

ABN , First Publish Date - 2022-11-24T22:30:24+05:30 IST

ఇళ్ల పట్టాలు ఇచ్చి భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. శ్రీరాంపూర్‌లోని 9వ వార్డు వాటర్‌ ట్యాంక్‌ ఏరియాలో గురువారం ఆయన 54 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు.

ఇళ్ల పట్టాలతో పేదలకు భరోసా

శ్రీరాంపూర్‌, నవంబరు 24: ఇళ్ల పట్టాలు ఇచ్చి భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. శ్రీరాంపూర్‌లోని 9వ వార్డు వాటర్‌ ట్యాంక్‌ ఏరియాలో గురువారం ఆయన 54 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. సింగరేణి ప్రాంత వాసుల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పట్టాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ము న్సిపల్‌ చైర్మన్‌ ఈసంపెల్లి ప్రభాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేష్‌, కౌన్సిలర్లు తిరుపతి, లక్ష్మీ, బౌతు లక్ష్మీ, మహేష్‌, బేర సత్యనారా యణ, గంగ, అన్నపూర్ణ, కెడిక ప్రకాష్‌రెడ్డి, కుమార్‌, టిఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు సుబ్బయ్య, టీబీజీ కేఎస్‌ నాయకులు అన్నయ్య, కె.సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఏసీసీ: ప్రజా సంక్షేమం, అభివృద్ది విషయంలో వెనుకడుగు వేయమని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. గురువారం 13వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. సమస్యలను తెలుసుకొని పరి ష్కరిస్తామని హామీ ఇచ్చారు. హమాలివాడ పాఠశాల లో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూ చించారు. సింగిల్‌ విండోచైర్మన్‌ వెం కటేష్‌, కౌన్సిలర్‌ శంకర్‌ పాల్గొన్నారు.

దండేపల్లి: టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితు లై నంబాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు గురువారం నడిపెల్లి విజిత్‌రావు సమక్ష్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కుండవా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ద్వారకలో గడప గడపకు టీఆర్‌ఎస్‌లో భా గంగా ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఎంపీపీ శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, పీఏసీఎస్‌ చైర్మ న్లు లింగన్న,సురేష్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌, పార్టీ అధ్యక్షకార్యదర్శు శ్రీనివాస్‌, వెంకటేష్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:30:28+05:30 IST