ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ

ABN , First Publish Date - 2022-03-18T05:58:38+05:30 IST

ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని ఆర్‌సెట్‌ భవనంలో నిరుద్యోగ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నామని, ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని డైరెక్టర్‌ మంగీలాల్‌ తెలిపారు.

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ


ఉట్నూర్‌రూరల్‌, మార్చి 17 : ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని ఆర్‌సెట్‌ భవనంలో నిరుద్యోగ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నామని, ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని డైరెక్టర్‌ మంగీలాల్‌ తెలిపారు. టూవిల్లర్‌, సెల్‌ఫోన్‌ మరమ్మతులు, హౌస్‌వేరింగ్‌, ఫ్రిజ్‌, ఏసీ మరమ్మతుల శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3 నుంచి టూవిల్లర్‌ రిపేరింగ్‌ శిక్షణ ప్రారంభం అవుతుందని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనములు, బస్సు చార్జీలు, టూల్‌కిట్‌ అందిస్తామన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు పదో తరగతి వరకు చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీలు దరఖాస్తులు ఈ నెల 31లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాల కోసం ఉదయం 10-30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9949412159, 8096093085, 9441530494, 8985633226లో సంప్రదించాలన్నారు. 

Read more