Flood flow: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం, 15 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-31T13:20:21+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్టు(Ellampally project)కు వరద ప్రవాహం(flood flow) కొనసాగుతుంది.

Flood flow: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం, 15 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల (Manchiryala): ఎల్లంపల్లి ప్రాజెక్టు(Ellampally project)కు వరద ప్రవాహం(flood flow) కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 15 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుంచి లక్షా 63 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో లక్షా 27 వేల క్యూసెక్కులు.. కాగా ఔట్‌ఫ్లో 1,20,000 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి  ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 15.352 టీఎంసీలు ఉంది.

Read more