ఆదివాసీ సేన మండల కమిటీ ఎన్నిక

ABN , First Publish Date - 2022-09-11T05:17:18+05:30 IST

ఆదివాసీ సేన, ఆదివాసీ రైతు సేన మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు ఉయిక లక్ష్మణ్‌ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని జవహర్‌నగర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవదౌలత్‌రావు, మోకాశి హాజరయ్యారు.

ఆదివాసీ సేన మండల కమిటీ ఎన్నిక

గుడిహత్నూర్‌, సెప్టెంబరు10: ఆదివాసీ సేన, ఆదివాసీ రైతు సేన మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు ఉయిక లక్ష్మణ్‌ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని జవహర్‌నగర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవదౌలత్‌రావు, మోకాశి హాజరయ్యారు. ఆదివాసీ సేన మండల అధ్యక్షుడిగా సెడ్మకి భీంరావు, ఉపాధ్యక్షులుగా కోవ్చడ వినోద్‌, టేకం భీంరావు, ప్రధాన కార్యదర్శిగా ఉయిక శ్యాంరావు, సంయుక్త కార్యదర్శులుగా పెందూర్‌ పురుషోత్తం, ఆత్రంబాలేరావు, కోశాధికారిగా సలాంజాకులను ఆదివాసీ రైతు సేన మండల కమిటీ ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. సం ఘ సభ్యుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రాయిసిడాంజంగుపటేల్‌, కుంరదశరథ్‌ పాల్గొన్నారు.

Read more