ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-11-07T22:11:37+05:30 IST

ఆసిఫాబాద్‌, నవంబరు 7: ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కా రానికి కృషి చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖా స్తులు స్వీకరించారు. ముదిరాజ్‌సంఘ భవన నిర్మాణా నికి స్థలం కేటాయించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీ ఆధ్వర్యంలో సభ్యులు వినతిపత్రం అందజేశారు.

ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి

ఆసిఫాబాద్‌, నవంబరు 7: ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కా రానికి కృషి చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖా స్తులు స్వీకరించారు. ముదిరాజ్‌సంఘ భవన నిర్మాణా నికి స్థలం కేటాయించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీ ఆధ్వర్యంలో సభ్యులు వినతిపత్రం అందజేశారు. వాంకిడి మండలం పాటగూడ గ్రామా నికి చెందిన వేలాది ధర్ము తనకు వృద్ధాప్య పింఛన్‌ ఇప్పించాలని, బెజ్జూరు మండలం రేచినికి చెందిన గణపతి తనకు సదరం సర్టిఫికేట్‌తోపాటు పింఛన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వాంకిడి మండలం కనర్‌గాం గ్రామానికి చెందిన బాపురావు, ఆసిఫాబాద్‌ మండలం నూర్‌నగర్‌కు చెందిన సుల్తానాబేగం, కాగజ్‌నగర్‌ మండలం వంజీరి గ్రామానికిచెందిన కమల, చింతలమానే పల్లి మండలం రుద్రాపూర్‌కు చెందిన శంకర్‌ పింఛన్‌ మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖా స్తులు అందజేశారు. కాగజ్‌నగర్‌ మండల కేంద్రా నికి చెందిన మహాత్మ శ్యాంరావు వారసత్వంగా వచ్చిన భూమిపై ఇతరులకు పట్టాజారీ చేశారని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయా లని దరఖాస్తు చేసుకున్నాడు. సిర్పూర్‌(టి) మండలం పారిగాం గ్రామానికిచెందిన జమునబాయి పోడుభూములసర్వేప్రక్రియలో తనకుచెందిన భూమిని సర్వేచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

Updated Date - 2022-11-07T22:11:37+05:30 IST

Read more