మూగ వేదన

ABN , First Publish Date - 2022-10-12T03:26:22+05:30 IST

లంపిస్కిన్‌ ప్రస్తుతం పశువులకు సోకుతున్న చర్మ సంబంధిత వ్యాధి. దీని బారిన పడి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. జ్వరం, శరీరం పై బొబ్బలతో నీరసించిపోతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స అం దించాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. వ్యాధి రాక ముందే వ్యాక్సి న్‌ వేయించాలని చెబుతున్నారు.

మూగ వేదన
లోగో

- జిల్లాలో లంపిస్కిన్‌ వ్యాధి గుబులు 

- చర్మ వ్యాధుల బారిన మూగజీవాలు 

- జిల్లాలోని పలు మండలాల్లో వ్యాపించిన వైరస్‌ 

- సకాలంలో చికిత్స చేయించాలని అధికారుల సూచన 


లంపిస్కిన్‌ ప్రస్తుతం పశువులకు సోకుతున్న చర్మ సంబంధిత వ్యాధి. దీని బారిన పడి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. జ్వరం, శరీరం పై బొబ్బలతో నీరసించిపోతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స అం దించాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. వ్యాధి రాక ముందే వ్యాక్సి న్‌ వేయించాలని చెబుతున్నారు. 


ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 11: జిల్లాలో మూగజీవాలు చర్మ సంబంధిత వ్యాధి లక్షణాలు గల లంపిస్కిన్‌తో బాధపడుతున్నాయి. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పశుసం వర్థక శాఖకు సూచించడంతో ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అయ్యే పశువులను సరిహ ద్దులోనే అడ్డుకుని, 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని అదికారు లకు సూచించింది. దీంతో జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దున ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాంకిడి సరిహద్దులో చెక్‌పోస్టును సైతం ఏర్పాటు చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, వాంకిడి, చింతలమానేపల్లి తదితర మండలాల్లోని  పశువు లకు స్వల్పంగా లంపిస్కిన్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్త మైన పశువైద్య సిబ్బంది పశువులకు వ్యాక్సినేషన్‌ చేపడుతున్నారు. 

- వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన పశువుల చర్మంపై దద్దుర్లు, పెద్ద పెద్ద కురుపులు ఏర్పడి జ్వరం వస్తుంది. వ్యాధి సోకిన పశువులు గడ్డి మేయవు. నీరు తాగవు, ఈ వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు ఈగలు, దోమల ద్వారా సోకుతుంది. వ్యాధికి గురైన పశువుపై వాలిన దోమలు, ఈగలు ఇతర పశువులపై వాలడంతో వ్యాధిని వ్యాప్తింపజేస్తాయి. వ్యాధి సోకిన పశువులను రెండు వారాల పాటు క్యారంటైన్‌ చేయాలి. వ్యాధి నివారణకు గోట్‌ ఫాక్స్‌ వ్యాక్సిన్‌ వేయించాలి. అలాగే ఈ వ్యాధి సోకిన పశువుల నుంచి పాలు తీయవద్దు, ఇతర జీవాలతో కలువనివ్వకూడదు. 

సరిహద్దు మండలాల్లో..

 జిల్లాకు సరిహద్దులో ఉన్న వాంకిడి, సిర్పూర్‌, కౌటాల, బెజ్జూర్‌ తది తర మండలాల్లో వార సంతలు జరుగుతుంటాయి. ఈ సంతల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన పశువులకు లంపిస్కిన్‌ వ్యాధి సోకి ఉంటే ఆ లక్షణాలున్న పశువులు ఇక్కడ తిరిగితే వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాద ముంది. లంపిస్కిన్‌ సోకిన పశువుల నుంచి సేకరించిన పాలతోనూ వ్యాధి రావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాధి సోక కుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

- పశువుల కొట్టాలను ప్రతీ రోజు శుభ్రం చేయాలి. 

- పశువుల కొట్టాల్లో నీరు నిల్వకుండా చూడాలి.

- వ్యాధి సోకిన పశువులకు జ్వరం ఆధికంగా ఉంటే పారాసిటమల్‌తో పాటు యాంటీబయాటిక్స్‌ మందులు వాడాలి. 

- పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న పశువుల వివరాలు సేకరించి రైతులను అప్రమత్తం చేయాలి. 


అప్రమత్తంగా ఉన్నాం..

- ఎం. సురేష్‌కుమార్‌, జిల్లా పశువైద్యాధికారి

పశువుల్లో వ్యాప్తించే లంపిస్కిన్‌ వ్యాధిపై అప్రమత్తంగా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా 19 పశువైద్యశాలల్లో 19,500 వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాం. ఆసిఫాబాద్‌, వాంకిడి, చింతలమానేపల్లి మండ లాల్లోని  లంపిస్కిన్‌ వ్యాధి లక్షణాలు స్వల్పంగా గుర్తించాం. ఈ మేరకు సిబ్బంది ని అప్రమత్తం చేసి పశువులకు వ్యాక్సినేషన్‌ చేశాం. ఇతర మండలాల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే పశువైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలి. 

Read more