బతుకమ్మ చీరల పంపిణీ దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-25T07:06:36+05:30 IST

రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీ దేశానికే ఆదర్శం
బతు కమ్మ చీరలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

దస్తూరాబాద్‌, సెప్టెంబరు 24 : రాష్ట్రంలో బతుకమ్మ చీరల పంపిణీ దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో శని వారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మహిళలకు బతు కమ్మ చీరలను ఆమె పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను అంద జేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శారద, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌, ఎంపీపీ సింగరి కిషన్‌, వైస్‌ ఎంపీపీ భూక్యా రాజునాయక్‌, సర్పంచ్‌ నిమ్మతోట రాజమణి, ఉప సర్పంచ్‌లు కొమురెల్లి, మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ఖానాపూర్‌లో..

ఖానాపూర్‌  : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఏఎంకే ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మి , సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్‌ మోహిద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ కలీం, వైస్‌ ఎంపీపీ వాల్‌సింగ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇప్ప సత్యనారాయణ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు జన్నారపు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చేపపిల్లల విడుదల

కడెం, సెప్టెంబరు 24 : కడెం ప్రాజెక్టులో శనివారం ఎమ్మెల్యే రే ఖానాయక్‌ చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మత్స్యకారుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు పాల్గొన్నారు. 

Read more