విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2022-09-09T04:42:46+05:30 IST

జిల్లాలో చని పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయా లని ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ ఇప్పటివరకు హాస్టళ్లలో విషజ్వరాలతో ఐదు గురు విద్యార్థులు మృతిచెందారని దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని ధర్నా
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 8: జిల్లాలో చని పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయా లని ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ ఇప్పటివరకు హాస్టళ్లలో విషజ్వరాలతో ఐదు గురు విద్యార్థులు మృతిచెందారని దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. హాస్టళ్లలో ఏఎన్‌ఎం లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ నాయకులు రంజిత్‌కుమార్‌, అరుణ్‌కుమార్‌, రవి,కృష్ణ పాల్గొన్నారు.

ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

కాగజ్‌నగర్‌ పట్టణంలోని కేజీబీవీలో మృతిచెందిన విద్యార్థిని ఐశ్వర్య కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని మహాత్మాజ్యోతిబాఫూలే మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేయాలని కోరారు.

Read more