భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-11-02T22:13:01+05:30 IST

గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సావాల సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏసీపీ తిరుపతిరెడ్డి సూచించారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
గూడెంలో ఘాట్‌రోడ్డును పరిశీలిస్తున్న ఏసీపీ తిరుపతిరెడ్డి

దండేపల్లి, నవంబరు 2: గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సావాల సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏసీపీ తిరుపతిరెడ్డి సూచించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఘాట్‌రోడ్డు, కార్తీక మాస ఉత్సావాల ఏర్పాట్లను బుధవారం ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, సీఐ కరీముల్లాఖాన్‌, ఎస్సై మచ్చ సాంబమూరితో కలిసి ఏసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉండడంతో ముందస్తుగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నైపథ్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ఏసీపీ తిరుపతిరెడ్డి సత్యదేవుడిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2022-11-02T22:13:01+05:30 IST
Read more