ఉత్తమ పంచాయతీల ఎంపికకు వివరాలు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-10-02T04:07:44+05:30 IST

జాతీయ ఉత్తమగ్రామ పంచాయతీల ఎంపికలో భాగంగా జిల్లాలో అన్ని పంచాయతీలలో జరుగుతున్న, జరిగిన అభివృద్ధి పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో శనివారం ఆమె సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఉత్తమ పంచాయతీల ఎంపికకు వివరాలు నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి

- అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి

ఆసిఫాబాద్‌, అక్టోబరు 1: జాతీయ ఉత్తమగ్రామ పంచాయతీల ఎంపికలో భాగంగా జిల్లాలో అన్ని పంచాయతీలలో జరుగుతున్న, జరిగిన అభివృద్ధి పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో శనివారం ఆమె సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తమ పంచాయతీల ఎంపికకోసం అన్నిరకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటారని దీనిని దృష్టిలో ఉంచుకొని నమోదుప్రక్రియ పకడ్బందీగా వేగవంతంగా చేయాలని ఆదేశించారు.

Read more