బాసర మండలంలో పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

ABN , First Publish Date - 2022-02-23T06:10:33+05:30 IST

బాసర మండల పరిధిలో మంగళవారం జిల్లా విద్యాధికారి డా. రవీంధర్‌రెడ్డి పర్యటిం చారు.

బాసర మండలంలో పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో
కౌట పాఠశాలలో..

బాసర, ఫిబ్రవరి, 22 : బాసర మండల పరిధిలో మంగళవారం జిల్లా విద్యాధికారి డా. రవీంధర్‌రెడ్డి పర్యటిం చారు. పలుపాఠశాలలో తనిఖీలు నిర్వ హించారు. విద్యాబోధన వసతి సౌక ర్యాలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కౌట గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉదయం పాఠశాల అసెంబ్లీ సమావేశానికి హాజరై విద్యార్థుల హాజరు క్రమ శిక్షణను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల గణిత ఉపాధ్యాయుడు రవీంధర్‌ 33 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటిరియల్‌ను అందజేయగా వాటిని డీఈవో విద్యార్థులకు పంపిణీ చేశారు 10వ తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించాలని కోరారు. ఈ సందర్భంగా దాతరవీంధర్‌ను సన్మానించారు. డీఈవో వెంట మండల విద్యాధికారి మైసాజీ, ప్రధానోపాధ్యాయులు గోవిందరాజులు, పీర్‌టీయూ అధ్యక్షులు కొక్కుల గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు. 


Read more