వివాదాల సుడిగుండంలో దళితబంధు

ABN , First Publish Date - 2022-10-08T07:29:31+05:30 IST

జిల్లాలో అమలవుతున్న దళితబంధు ప థకం చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి.

వివాదాల సుడిగుండంలో దళితబంధు
దళితదండోరా దీక్షలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

అందరికీ వర్తింపజేయాలంటూ పెరుగుతున్న డిమాండ్‌ 

నర్సాపూర్‌ ఘటనతో వెలుగులోకి లుకలుకలు 

ఇప్పటి వరకు జిల్లాలో 261 కుటుంబాలకు పంపిణీ 

రెండోవిడతలో లబ్ధిదారుల ఎంపికపై వివాదం

నిర్మల్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అమలవుతున్న దళితబంధు ప థకం చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. ఈ పథకం మొదటి నుంచి వివాదా ల సుడిగుండంలో చిక్కుకొని విమర్శలకు కారణమవుతోంది. ఒక్కోగ్రామంలో మొద టివిడత పేరిట కొంత మందిని మాత్రమే ఎంపిక చేయడం పట్ల అ సంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటివిడతలో ఇప్పటి వరకు 261 కుటుంబాలకు దళితబంధును పంపిణీ చేసినప్పటికీ, మిగతా దళిత కుటుంబాలకు తమకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలంటూ డిమాండ్‌ చే స్తున్నాయి. అయితే మొదటివిడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులపై అర్హు లైన పేదదళితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలో కొంతమంది దళితులు అనర్హులకు ఈ పథకాన్ని వర్తింపజేసి అర్హులైన తమను విస్మరించడం ఏంటని సాక్షాత్తు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డినే నిలదీశారు. అలాగే తామందరికీ దళితబంధు ఎందుకు ఇవ్వరంటూ, అనర్హులకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీంతో మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, పోలీసులు కేసులు సైతం నమోదు చేసిన వ్యవహారం ప్రస్తుతం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. దళితులను కించపర్చిన మంత్రిపై కేసు నమోదు చేయాలని అలాగే ఆయన దళితులందరికీ క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌పార్టీ ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా దళిత దండోరా పేరిట మంత్రి నిర్వాహకంపై శుక్రవారం చేపట్టిన ఆందోళన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. దళితదండోరా పేరిట ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి కలెక్టరేట్‌ ముందు దీక్షకు సిద్ధం కావడంతో పోలీసులు ఆయన దీక్ష చేపట్టకుండా ఆంక్షలు విధించారు. అయితే మహేశ్వర్‌రెడ్డి ఏకంగా ఆయన ఇంట్లోనే దళితులందరితో కలిసి దీక్ష చేపట్టారు. బీజేపీ నాయకులు మంత్రి నిరసిస్తూ దళితులకు అండగా ఉంటామంటూ ప్రకటించారు. దళితులతో కలిసి మంత్రిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కూడా బీజేపీ నాయకులు ముందునడిచారు. ఇలా దళితబంధు పథకం ఇటు అర్హులైన పేద దళితుల నుంచే కాకుండా రాజకీయంగా ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలను ఎదుర్కొంటూ ఏటికి ఎదురీదుతోందన్న వాదనలు విస్తరిస్తున్నాయి. అయితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు దళితబంధు పథకం కింద అర్హులైన వారందరికీ రెండోవిడతలో దశలవారీగా ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ మాటలను దళితులు పట్టించుకోకుండా తమకు రెండో విడతతో సంబంధం లేకుండా దళితబంధు పథకాన్ని అందించాలంటూ నిలదీస్తున్నారు. ఇలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నదళితబంధు పథకం రోజుకో వివాదంలో చిక్కుకుంటూ రాజకీయంగా దుమారానికి కారణమవుతోందంటున్నా రు. 

లబ్ధిదారుల ఎంపికపై ఆరోపణలు

ఇదిలా ఉండగా మొదటిదశ కింద చేపట్టిన దళితబంధు లబ్దిదారుల ఎంపిక ప్ర క్రియపై మొదటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారపార్టీ నేతలు సిఫారసులు చేసిన వారికే మొద టిదశ కింద ఎంపిక ప్రక్రియ జరిగిందంటూ ఫిర్యాదులు వచ్చాయి. అలా గే అధికారపార్టీ నేతలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా బలోపేతమైన వారిని కూడా ఎంపిక చేసి అర్హులైన పేదలను విస్మరించారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై పలుగ్రామాల్లో అర్హులైన పేదదళితులు ఇటు అధికారులను అటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను బహిరంగంగా నిలదీస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నర్సాపూర్‌ (జి) మండల కేంద్రంలో దళిత మహిళలు స్వయంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని నిలదీశారు. అలాగే గొల్లమాడ, టెంబుర్నితో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా దళితులు అధికారుల తీరుపై బహిరంగంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు గాని ఎంపిక జాబితాలో మార్పులు గాని జరగకపోవడం దళితుల ఆగ్రహానికి కారణమవుతోందంటున్నారు. 

మూడువిడతల్లో పంపిణీకి చర్యలు

ఇదిలా ఉండగా దళితబంధు పథకాన్ని మూడు విడతలుగా అర్హులైన దళితులందరికీ అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మొదటి విడతలో 500 మందికి అలాగే రెండు, మూడువిడతల్లో 500 చొప్పున వెయ్యి మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ధారించారు. కాగా మొదటి విడత పంపిణీపై పెద్దఎత్తున విమర్శలు, ఫిర్యాదులు వస్తుండడం, రెండోవిడతపై కూడా ఆరోపణలు మొదలవ్వడంతో అధికారులు సందిగ్దానికి గురవుతున్నారు. అడుగడుగునా రాజకీయ ఒత్తిళ్లు, సిఫారసులు పెరిగిపోతున్న కారణంగా అధికారులు సైతం పథకాన్ని పారదర్శకంగా అమలు చేయలేకపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రెండోవిడత, మూడోవిడతల్లో అర్హులందరికీ న్యాయం చేస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దీని అమలు విషయంలో మాత్రం దళితులు సంతృప్తి చెందడం లేదంటున్నారు. 

రాజకీయ చక్రబంధంలో దళితబంధు

ప్రస్తుతం దళిత బంధు పథకం ప్రతిపక్ష పార్టీలకు విమర్శనాస్త్రంగా మారింది. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీకి దళిత బంధు ప్రచార అస్త్రంగా మారినప్పటికి ఈ పథకం అమలులోని లుకలుకలు ప్రతిపక్షాలకు అస్ర్తాలుగా మారుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలో దళిత బంధు తామే ఇస్తున్నామంటూ అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటుండగా ఈ పథకం కింద ఎంపిక కాని వారి అసంతృప్తిని ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఆందోళనకు ఊతమిస్తున్నాయి. ఇటీవల మంత్రి దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు ఈ పథకం కింద ఎంపిక కాని వారిని ఒకే చోటకి చేర్చి కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అధికార టిఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శల దాడిని కొనసాగిస్తున్నాయి. కాగా మొత్తానికి దళిత బంధు పథకం కింద ఎంపికైన వారికి సంబురం నింపుతుండగా ఎంపిక కాని పేద దళితుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. అలాగే అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ దళితబందు పథకాన్ని తమ రాజకీయ అస్త్రంగా ప్రచారం చేసుకుంటూ దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ పథకంలోని లోసుగులు లోపాలతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు ఎదురుదాడిని కొనసాగిస్తున్నాయి. 
Read more