సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-12T04:12:34+05:30 IST

విజయవాడలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌, పట్టణ కార్యదర్శి శ్రీధర్‌లు పేర్కొన్నారు.

సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నాయకులు

బెల్లంపల్లి, అక్టోబరు 11: విజయవాడలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌, పట్టణ కార్యదర్శి శ్రీధర్‌లు పేర్కొన్నారు. మంగళవారం బాబుక్యాంపు ప్రెస్‌క్లబ్‌లో విలే కరుల సమావేశంలో మాట్లాడారు. మహాసభలకు  ఐదు రాష్ట్రాల ముఖ్యమం త్రులు హాజరవుతారని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చేయాల్సిన పోరాటాలపై కార్యచరణ రూపొందిస్తామన్నారు. లక్ష్మీనారాయణ, సోని, రంగ ప్రశాంత్‌, స్వామిదాస్‌, కళారాణి పాల్గొన్నారు. 


 

Read more