15 లోగా సీసీ రోడ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-02-23T06:06:45+05:30 IST

సీసీ రోడ్ల నిర్మాణం పనులు మార్చి 15లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశిం చారు.

15 లోగా సీసీ రోడ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

నిర్మల్‌ టౌన్‌, ఫిబ్రవరి 22 : సీసీ రోడ్ల నిర్మాణం పనులు మార్చి 15లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశిం చారు. జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీడీవో, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 23 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన నిధులతో జిల్లాలో సీసీరోడ్ల నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని, ఎంపీడీ వోలు, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన సీసీరోడ్ల నిర్మాణం పనులను మార్చి 15 లోగా పూర్తి చేయాలని అన్నారు. పనుల పురో గతిపై అధికారులను అడిగి తెలుసుకున్న అనంతరం కొన్ని మండలాల్లో పనులు సరిగ్గా జరడం లేదని, వేగవంతం చేయాలని, మెటీరియల్‌ తక్కువ  కాకుండా చూసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 15 వరకు సీసీ రోడ్ల నిర్మాణం పనులు పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పంచా యతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శంకరయ్య, సీఈవో సుధీర్‌, డీపీవో వెంకటే  శ్వర్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఇంజనీర్లు తుకారాం, చందు జాదవ్‌, కమలాకర్‌, సురేష్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు. 


Read more