సమస్యలపై నిరంతర పోరాటం

ABN , First Publish Date - 2022-09-11T05:16:52+05:30 IST

జిల్లాలో నెలకొన్న సమస్యలను పరి ష్కరించే వరకూ పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ము డుపు ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాల యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరి గిందని తెలిపారు. జిల్లా నుంచి తనతోపాటు ముడుపు నళిని కౌన్సిల్‌ స భ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి హైద రాబాద్‌కు వెళ్లాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అందుకు ఆ దిలాబాద్‌ టూ ఆర్మూర్‌ వరకు రైలు మార్గాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు.

సమస్యలపై నిరంతర పోరాటం

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 10: జిల్లాలో నెలకొన్న సమస్యలను పరి ష్కరించే వరకూ పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ము డుపు ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాల యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరి గిందని తెలిపారు. జిల్లా నుంచి తనతోపాటు ముడుపు నళిని కౌన్సిల్‌ స భ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి  హైద రాబాద్‌కు వెళ్లాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అందుకు ఆ దిలాబాద్‌ టూ ఆర్మూర్‌ వరకు రైలు మార్గాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఆసియా ఖం డంలోనే ఎక్కువగా పత్తిపండే జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్క్‌ను స్థాపించాలని తెలిపారు. రైతులకు రుణ మాఫీ చేయాలని, దళితులకు దళిత బస్తీ, దళిత బంధును ఇవ్వాలన్నారు. సమావేశంలో అరుణ్‌, సిర్ర దేవేందర్‌, మెస్రం భా స్కర్‌, నట్వాజి, బెజ్జంకి నర్సింగ్‌రావు, దేవిదాస్‌ పాల్గొన్నారు.     


Updated Date - 2022-09-11T05:16:52+05:30 IST