దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-25T04:01:58+05:30 IST

ఎన్నికల సమయంలో దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్‌ దళితులను మోసం చేశాడని ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘనాథ్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రజా గోస బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీని గూడెం నుంచి కన్నెపల్లి వరకు నిర్వహించారు.

దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్‌
గూడెం నుంచి కన్నెపల్లికి బీజేపీ శ్రేణుల బైక్‌ ర్యాలీ

దండేపల్లి, సెప్టెంబరు 24 : ఎన్నికల సమయంలో దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్‌ దళితులను మోసం చేశాడని ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘనాథ్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రజా గోస బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీని  గూడెం నుంచి కన్నెపల్లి వరకు నిర్వహించారు.  దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాబోయ్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, నాయకులు హరిగోపాల్‌, రంగరావు, మున్నరాజ్‌ సిసోడియో, శ్రీనివాస్‌రావు, రాజినేష్‌జైన్‌  పాల్గొన్నారు. గూ డెం సత్యనారాయణస్వామిని  దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామి వారి శేష వస్త్రలతో సన్మానించారు.  

లక్షెట్టిపేట:  ప్రజా గోస బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీలో   రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే దివాకర్‌రావు అసమర్ధత వల్లనే లక్షెట్టిపేట పట్టణానికి 150 పడకల ఆసుపత్రి, ఫైర్‌ స్టేషన్‌ మంజూరు కావడం లేదని ఎద్దేవా చేశారు.  

 

Read more