ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-02-20T04:18:38+05:30 IST

ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలో శివాజీ జయంతిని పురస్కరించుకుని శివాజీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

- ఎమ్మెల్యే ఆత్రం సక్కు
- జిల్లా వ్యాప్తంగా శివాజీ విగ్రహం, చిత్రపటాల వద్ద నాయకుల నివాళి

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలో శివాజీ జయంతిని పురస్కరించుకుని శివాజీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ చిత్రపటాన్ని ఆరె సంఘం కులస్థులు ఇంట్లో పెట్టుకోవాలన్నారు. శివాజీ చరిత్రను భావితరాలకు అందించేందుకు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. కమిటీ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు కమిటీ హాల్‌ నుంచి పొట్టి శ్రీరాములు చౌక్‌, గాంధీ చౌక్‌, వివేకానంద చౌక్‌, అంబేద్కర్‌ చౌక్‌ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు జెండావిష్కరణ చేశారు. ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఆరె సంఘం, ఆయా సంఘాల నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యకర్మంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, టీఎన్‌జీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జైరాం, శ్రీనివాస్‌, దాదారాం, బిక్కాజీ, సంతోష్‌, నాగయ్య, రవీందర్‌, మోహన్‌, ఆయా సంఘాల నాయకులు విశాల్‌, కేశవ్‌రావు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌ టౌన్‌: పట్టణంలోని శివాజి చౌక్‌లో ఛత్రపతి శివాజి మహరాజ్‌ 392వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చౌక్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం భజరంగ్‌దళ్‌ కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కన్వీనర్‌ శివగౌడ్‌ జెండాను ఆవిష్కరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ వాహిని, భజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు, ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌ ప్రముఖ్‌ పోతరాజుల లక్ష్మణ్‌, వాడపల్లి విజయ్‌, అంగల సంతోష్‌, కుందారపు రాజు, అరుణ్‌ లోయా, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి:  చింతల మానెపల్లితో పాటు అన్ని గ్రామాల్లో ఆరె కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం, చిత్ర పటాల కు పూజల మాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో ఎంపీపీ నానయ్య, వెంకయ్య, నారాయణ, మారుతి, రాజన్న, డి.రాజన్న తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు: మండలంలోని పాపనపేట, బారెగూడ, తలాయి, పోతెప ల్లి, ముంజంపల్లి గ్రామాల్లో ఆరెకుల సంఘం ఆద్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో ఆరెకుల సంఘం, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.
రెబ్బెన: మండల కేంద్రంలో ఆరెకులస్థుల సమక్షంలో శనివారం ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భం గా జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సంతోష్‌, ఎంపీటీసీ మధునయ్య, సర్పంచ్‌ లహల్యదేవి, శ్యాం, ఎస్సై భవానీసేన్‌, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, నాయకులు చంద్రయ్య, సుదర్శణ్‌గౌడ్‌, రాజేశ్వర్‌, ఆనంద్‌, శ్రీనివాస్‌, రావుజీ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం: మండలంలోని గిరివెల్లి, కర్జీ, దహెగాం, ఇట్యాల, రాళ్లగూ డ, ఐనం తదితర గ్రామాల్లో ఆరె కులస్థులు ఛత్రపతి శివాజీ జయంతి  సందర్భంగా జెండాలను ఎగుర వేసి విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు బక్కయ్య, నారాయణ, దామోదర్‌, నారాయణ, వెంకన్న, పుప్పాల లక్ష్మి, రాజన్న, వైస్‌ ఎంపీపీ సురేష్‌, ఎంపీటీసీ జయలక్ష్మి, మల్లేష్‌, ఊశన్న, ప్రకాష్‌, బాబాజీ, తిరుపతి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్‌(టి): మండల కేంద్రంలో ఆరె సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించారు. వెంకట్రావుపేట గ్రామంలో సర్పంచ్‌ అర్చన, ఉప సర్పంచ్‌ దౌలత్‌, మాజీ సర్పంచ్‌ సంతోష్‌లు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు హారతులతో శివాజీ చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు.  కార్యక్రమంలో ఆరె సంఘం మండలాధ్యక్షుడు రాజేందర్‌, ఉప సర్పంచ్‌ మహేష్‌, నాయకులు శంకర్‌, విక్రం, కిశోర్‌, లాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట: మండల కేంద్రంతో పాటు చెడ్వాయి, పోతెపల్లి, కొండపల్లి, ఆగర్‌గూడ, ఎల్లూరు గ్రామాల్లో శివాజీ విగ్రహాలు, చిత్రప టాలకు పూల మాలలు వేసి జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు సంజీవ్‌, సుధాకర్‌, నాయకులు తిరుపతి, మధుకర్‌, శ్రీనివాస్‌, బండు, అంజన్న, సదాశివ్‌ తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి:  మండల కేంద్రంలో ఆరె క్షత్రీయ సంఘం  ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి  ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, ఎంపీపీ ముండే విమలాబాయి ఎస్‌బీఐ చౌరస్తా వద్ద గల శివాజీ విగ్రహానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పంచారు.  కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మెన్‌ జాబిరే పెంటయ్య,  సర్పంచ్‌ బండె తుకారాం, బీజేపీ మండల అధ్యక్షుడు రామగిరి శ్రావణ్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దీపక్‌ ముండే, సత్యనారాయణచారి, అంబేద్కర్‌ సంఘం నాయకుడు అశోక్‌, కమ్మర సంఘం అధ్యక్షుడు బావునే బాబురావు, ఆరెకుల సంఘం నాయకులు జాబిరే గణేష్‌, దాదాజీ పాల్గొన్నారు.   
జైనూరు: మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌, పీఆర్టీయూ నాయకులు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు.  కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యులు ఇంతీయాజ్‌లాల, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నాక విజయ్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ, రాజు, మేస్రాం లక్ష్మణ్‌,  వైస్‌ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్‌, సహకార చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, మాజీ జడ్పీటీసీ కొడప విశంరావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more