ఆసిఫాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌

ABN , First Publish Date - 2022-06-13T03:47:38+05:30 IST

ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా 2019ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన చాహత్‌ బాజ్‌పాయ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆది వారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలలో జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తున్న వరుణ్‌ రెడ్డిని ఐటీడీఏ పీవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరుణ్‌రెడ్డి స్థానంలో ఆయన సతీమణి చాహత్‌ బాజ్‌పాయ్‌ని నియమించింది.

ఆసిఫాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌
చాహత్‌ బాజ్‌పేయ్‌

- వరుణ్‌రెడ్డికి ఐటీడీఏ పీవోగా బాధ్యతలు

ఆసిఫాబాద్‌, జూన్‌ 12: ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా 2019ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన చాహత్‌ బాజ్‌పాయ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆది వారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలలో జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తున్న వరుణ్‌ రెడ్డిని ఐటీడీఏ పీవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరుణ్‌రెడ్డి స్థానంలో ఆయన సతీమణి చాహత్‌ బాజ్‌పాయ్‌ని నియమించింది. చాహత్‌బాజ్‌పాయి 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐఏఎస్‌ క్యాడర్‌లో ఏలూరు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నంధ్యాల సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐఏఎస్‌ క్యాడర్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్‌ క్యాడర్‌కు మార్చి 2న బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆమెను ఆసిఫాబాద్‌ అదనపుకలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more