కేంద్రీయ విద్యాలయ పనులు వేగంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-10-12T04:10:49+05:30 IST

గుడిపేట 13వ బెటాలియన్‌లో కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యే దివాకర్‌ రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.

కేంద్రీయ విద్యాలయ పనులు వేగంగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళ్లికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 11: గుడిపేట 13వ బెటాలియన్‌లో కేంద్రీయ విద్యాలయం భవన  నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యే దివాకర్‌ రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ 9 ఎకరాల  2 గంటల భూమిలో భవన నిర్మా ణానికి మొదటి విడత రూ.20 లక్షలు మంజూరు చేశామని, పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రీ య విద్యాలయంలో బోధన, మౌలిక సదుపాయాల కల్పన, ఇతరత్రా అంశాలపై సమీక్షించి పలు సూచ నలు, సలహాలు చేశారు భూ సంబంధిత కార్యక్ర మాలపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.   ప్రిన్సిపాల్‌ సుభాషిణి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ దుర్గా ప్రసాద్‌,  సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.   

Read more