కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదు

ABN , First Publish Date - 2022-07-05T07:35:49+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎనిమిదేళ్లుగా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదు
మాట్లాడుతున్న మహేశ్వర్‌ రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 4 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎనిమిదేళ్లుగా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన నివాసంలో విలేకరుల తో మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రజలకు బూటకపు మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తున్నారన్నారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంచుతామని చెప్పి ఇప్పటికీ ఇచ్చిన మాట నిలుపుకోలేదని వారికి తమ మద్దతు ప్రకటించారు. వారి సమస్య పరిష్కరించాలన్నారు. ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పేరోజు ఎంతోదూరం లేదన్నారు. దమ్ముంటే కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేసి ప్రజల తీర్పుకోరాలన్నారు. నిర్మల్‌ మున్సిపల్‌ పారిశుధ్య ఉద్యోగుల ని యామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ అధికారిని నియమించినా ఇంతవరకు ఏ విచారణ జరుగలేదన్నారు. హైకోర్టు ఈ నెల 8లోగా విచారణ నివేదిక సమ ర్పించాలని ఆదేశించినా ఇప్పటి వరకు ఏ చర్య లేదన్నారు. విచారణ అధికారిగా ఆర్డీవో నియామకం అబద్దమని అన్నారు. అక్రమాలకు సంబంధించిన అన్ని రుజువులు కోర్టుకు సమర్పించి నిరుద్యోగుల కోసం న్యాయ పోరాటం చేస్తామ న్నారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు తక్కల రమణారెడ్డి, అజహర్‌, బి. ముత్యంరెడ్డి, జమాల్‌, సత్యం చంద్రకాంత్‌, అయ్యన్నగారి పోశెట్టి, బాపురెడ్డి, మార గంగారెడ్డి, రాథోడ్‌ సంతోష్‌, ధని పోతన్న, శ్రీకాంత్‌రెడ్డి, మహారాజు రవి, మౌర్య, వెంకటాపూర్‌ నారాయణరెడ్డి, ఉదయ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఏలేటి

సారంగాపూర్‌, జూలై 4 : మండలంలోని గోపాల్‌పేట్‌ గ్రామంలో అనా రోగ్యంతో మృతి చెందిన దీపక్‌ కుటుంబాన్ని సోమవారం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట నాయకులు రామ్‌శంకర్‌ రెడ్డి, సాహెబ్‌రావు, బడి పోతన్నలతో పాటు నాయకులు ఉన్నారు. 

Read more