కారులో కయ్యం!

ABN , First Publish Date - 2022-03-23T06:53:48+05:30 IST

అధికార కారు పార్టీలో కస్సు, బుస్సు అంటూ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రతిపక్షంలో విపక్షం అన్నటు ్లగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. కొన్ని సందర్భాలలో నువ్వేంత? అంటే నువ్వేంత? అనే స్థాయిలో దాడులకు సైతం వెనుకాడడం లేదు.

కారులో కయ్యం!
ఇటీవల భీంపూర్‌ మండలంలో సమావేశమైన టీఆర్‌ఎస్‌ నాయకులు(ఫైల్‌)

బోథ్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగమాగం
నియోజవర్గ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న నేతలు
గ్రూపు విభేదాలతో రగిలిపోతున్న స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీలు
జోగు రామన్నకు పార్టీ పగ్గాలు అప్పగించినా.. చల్లారని అసమ్మతి
వర్గపోరుతో విసిగెత్తిపోతున్న ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు
జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో రసవత్తర రాజకీయం

ఆదిలాబాద్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): అధికార కారు పార్టీలో కస్సు, బుస్సు అంటూ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రతిపక్షంలో విపక్షం అన్నటు ్లగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. కొన్ని సందర్భాలలో నువ్వేంత? అంటే నువ్వేంత? అనే స్థాయిలో దాడులకు సైతం వెనుకాడడం లేదు. ముందు నుం చి బోథ్‌ నియోజకవర్గంలో భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నా.. అధిష్టానం పెద్ద గా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాల ప్ర భావం పెద్దగా కనిపించకపోవడంతో అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం పార్టీలో విభేదాలకు దారి తీస్తున్నాయి. ఎమ్మెల్యే వర్గం తో పాటు మాజీ ఎంపీ గేడం నగేష్‌, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌, పాడి పరిశ్రమ చైర్మన్‌ లోక భూమారెడ్డి, బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ వేర్వేరు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులతోనే గత మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. తలమడుగు, బజార్‌హత్నూర్‌ మండలాలో పూర్తిగా కాంగ్రెస్‌ ఆధిపత్యం కనిపించగా.. సిరికొండ, గుడిహత్నూ ర్‌, ఇచ్చోడ మండలాలో బీజేపీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని  తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. అయితే ఇటీవల జిల్లా పార్టీ పదవుల్లోనూ పార్టీ అ ధిష్టానం ఆచితూచిగా అడుగులు వేసింది. మొదట మాజీ ఎంపీ గేడం నగేష్‌కు జిల్లా పార్టీ అధ్యక్ష పదవీ ఖరారు అయినా.. బోథ్‌ నియోజకవర్గంలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో చివరి సమయంలో జోగు రామన్నకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయినా ఈ నియోజకవర్గంలో అసమ్మతి చల్లారినట్లే కనిపించడం లేదు. జిల్లా సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కావడంతో జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ పరిస్థితులను చక్కదిద్దే ప్రయ త్నం పెద్దగా చేయడం లేదన్న టాక్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో వినిపిస్తోంది.
ఎమ్మెల్యే టార్గెట్‌గా అడుగులు
బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావుకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎమ్మెల్యే టార్గెట్‌గా కొంత మంది నేతలు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నాలుగు, ఐదు గ్రూపుల ద్వారా విడిపోయిన టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరిదారి వారిదే అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు. తమకు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయంటూ కార్యకర్తల వద్ద చెప్పుకుంటూనే ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్‌ రావడం కష్టమేనంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన వైఫల్యాలను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే మండలాల పర్యటనలో తమ అనుచరులు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు పోటీగా ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. బోథ్‌ ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌, బీజేపీ నేత ల నుంచి పెద్దగా విమర్శలు రాకపోయినా.. సొంత పార్టీ నేతలనే ఎదుర్కొనేందుకు నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు. ఒకరిపై ఒకరు అధిష్టానం పెద్దల కు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. సోషల్‌ మీడియాలోను పో టాపోటీగా ఎవరికి వారే సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంటున్నా రు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్‌ అయినప్పటికీ ఈ నియోజక వర్గంలో మాత్రం అవేమీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ మాజీలే పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు.
విసుగెత్తిపోతున్న ప్రజాప్రతినిధులు
అధికార పార్టీలో వర్గపోరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, మార్కెట్‌ కమిటీల చైర్మన్‌లతో పాటు  మండల పార్టీ అధ్యక్షులు నేతల తీరుతో విసిగెత్తి పోతున్నారు. తమకు ఎమ్మెల్యే  సరై న ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రగిలిపోతున్నారు. ఇటీవల భీంపూర్‌ మండ లంలో కొంతమంది టీఆర్‌ఎస్‌ నేతలు రహస్య సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ఆగడాలపై మండిపడినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే సీటుకు నిరసనగా మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్దమయ్యారు. తాంసి మండలానికి చెందిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్‌ అడ్డి బోజారెడ్డి, జిల్లా పార్టీ అ ధ్యక్షుడు జోగు రామన్నలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో వె నిక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఇకపై తమను ఎమ్మెల్యే పట్టించుకోకుంటే తాము కూడ ఎమ్మెల్యే ను పట్టించుకోబోమని ప్రకటించారు. అలాగే బోథ్‌ మండలంలో ఇటీవల జరి గిన ఉపాధి హామీ ప్రజావేదిక సాక్షిగా ఎమ్మెల్యే, ఎంపీపీ తులశ్రీనివాస్‌ వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు కనిపించాయి. ఒక దశలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోనేందుకు సిద్దమయ్యారు. ఉపాధి హామీ నిధులను మీరంటే మీరే పక్కదారి పట్టించారని  ప్రతిపక్షాల మాదిరిగా తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఆలాగే తలమడుగు, నేరడిగొండ, ఇచ్చో డ, సిరికొండ, గుడిహత్నూర్‌ తదితర మండలాల్లోనూ నేతల మధ్య వర్గపోరు అందనంతా దూ రానికి వెళ్లింది. బోథ్‌ నియోజకవర్గంలో అధికా ర పార్టీలో పరిస్థితులు ఆగమవుతున్న అదిష్టా నం దృష్ఠి సారించక పోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

Updated Date - 2022-03-23T06:53:48+05:30 IST