బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-06T22:07:04+05:30 IST

జాతీయ రహదారి విస్త రణ పనుల్లో భాగంగా బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మధుకాన్‌ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

 బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలి

భీమారం, డిసెంబరు 6: జాతీయ రహదారి విస్త రణ పనుల్లో భాగంగా బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మధుకాన్‌ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలో బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ ఏడాదిగా పనులు పూర్తికాకపోవడంపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. నెల రోజుల్లోగా పనులను పూర్తి చేయాలన్నారు. హైవేకు ఇరువైపులా ఇండ్లు ఉన్న వారు ర్యాంపులు ఏర్పాటు చేసుకున్నారని, ప్రమాదా లు జరగకుండా ఉండాలంటే వీటిని తొలగించాలని సూచించారు. డివైడర్లపై, రోడ్డుకిరువైపులా పిచ్చి మొక్కలు ఉండడంతో కార్యదర్శి శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. ఆవడం, ఆరేపల్లి ఎక్స్‌రోడ్‌ల వద్ద ప్రత్యేకంగా సైడ్‌ కంచెలను ఏర్పాటు చేయాలని, రానున్న రోజుల్లో ఈ కూడళ్లలో జంక్షన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. జోడు వాగు వద్ద రోడ్డు విస్తరణ పనులను పరిశీ లించి ఫారెస్టు అధికారులతో మాట్లాడారు. సర్పంచు గద్దె రాంరెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, మం డల నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్‌, మధునయ్య, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

జైపూర్‌: రసూల్‌పల్లె వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వేగవంతంగా పూర్తి చే యాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు.

చెన్నూరు: అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. చెన్నూరు పట్టణంలో ఆయన పర్యటిం చారు. మార్కెట్‌ యార్డు వద్ద రూ.33 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. వంద పడకల ఆసుపత్రి, బస్‌ డిపో కోసం స్థలాలను పరి శీలించారు. పట్టణంలో రూ.2.65 కోట్లతో 6.34 ఎక రాల్లో నిర్మిస్తున్న మిని స్టేడియం పనులను పరిశీ లించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. చెన్నూరు క్యాంపు కార్యాలయంలో దళిత బంధు పథకం కింద మంజూరైన ఐదుగురు లబ్ధి దారులకు వాహనాలను అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T22:07:07+05:30 IST