వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-27T04:54:59+05:30 IST

మండల కేంద్రంలోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆల యంలో బ్రహ్మోత్సవాలు సోమవారం వైభ వంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేకపూజలు నిర్వహిం చారు.

వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
విద్యుత్‌ దీపాలతో అలంకరించిన వేంకటేశ్వరస్వామి ఆలయం

సిర్పూర్‌(టి), సెప్టెంబరు 26: మండల కేంద్రంలోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆల యంలో బ్రహ్మోత్సవాలు సోమవారం వైభ వంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేకపూజలు నిర్వహిం చారు. నవరాత్రుల సందర్భంగా స్వామివారు ఒక్కోరోజు ఒక్కోవాహనంపై ఊరేగనున్నట్లు ఆలయఅర్చకుడు గంగు సత్యనారాయణ తెలి పారు. సోమవారం మొదటిరోజు కల్పవృక్ష వాహనంపై స్వామివారు గోపాలకృష్ణుడి రూపంలో దర్శణమిచ్చారు. నేడు హంస వాహనంపై విహరించనున్నారు. వేంకటేశ్వర స్వామివారికి తిరుమల తిరుపతి దేవ స్థానం తరువాత ప్రతియేట సిర్పూర్‌(టి) వేంకటేశ్వ రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత.

Read more