భరోసా ఇచ్చే వరకు గ్రామసభల బహిష్కరణ

ABN , First Publish Date - 2022-11-23T22:15:19+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 23: ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చేంతవరకు పోడు భూములకు సంబంధించిన గ్రామసభలు బహిష్కరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖాధికారులు పేర్కొన్నారు.

భరోసా ఇచ్చే వరకు గ్రామసభల బహిష్కరణ

- అటవీ అధికారులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 23: ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చేంతవరకు పోడు భూములకు సంబంధించిన గ్రామసభలు బహిష్కరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖాధికారులు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో హత్యకు గురైన శ్రీనివాసరావుకు జిల్లా కార్యాలయంలో నివాళులు అర్పించారు. అనంతరం చెక్‌పోస్టు నుంచి కలెక్టరేట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం టీఎన్జీవో జిల్లా ప్రధానకార్యదర్శి రాజశేఖర్‌, ఎఫ్‌ఆర్వో దయాకర్‌, జూనియర్‌ఫారెస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌ మాట్లాడుతూ అటవీ అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం పోడు భూముల సర్వేకు సంబంధించి తమను ముద్దాయిలుగా చేసే ప్రయత్నం జరుగు తోందన్నారు. అనంతరం ధర్నా వద్దకు చేరుకున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ పోడు భూములకు సంబంధించి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో గ్రామసభల నిర్వహణ పోలీసుబందో బస్తు ఏర్పాటు చేస్తామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు. దీనికోసం ఎస్పీతోపాటు ఇతర అధికారులతో సమా వేశం నిర్వహించినట్లు అధికారులకు ఉన్న అభ్యంత రాలను సబ్‌డివిజనల్‌ స్థాయి కమిటీకి రాత పూర్వ కంగా అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీఅధికారి దినేష్‌కుమార్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోచయ్య, రాజశేఖర్‌, అటవీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T22:15:21+05:30 IST