బోధన్‌ - భైంసా రహదారి పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-21T00:02:55+05:30 IST

భైంసా వయా బాసర 161వ జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి.

బోధన్‌ - భైంసా రహదారి పనులు ప్రారంభం

బాసర, నవంబరు, 20 : బోధన్‌ - భైంసా వయా బాసర 161వ జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. బాసర రైల్వే స్టేషన్‌ చౌరస్తాలో ఆదివారం మట్టి నమూనాలను సేకరించారు. ఈ చౌరస్తాలో అండర్‌పాస్‌ (ప్లై ఓవర్‌) బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇందుకోసం నేల స్వభావం వంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు. బోధన్‌ నుంచి భైంసా వరకు 56 కిలో మీటర్ల నిర్మాణం జరగనుంది. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారిగా మారనుంది. ఇందులో భాగంగానే బాసర గోదావరి వద్ద వాహనాలు వెళ్లేందుకు మరో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

Updated Date - 2022-11-21T00:02:55+05:30 IST

Read more