నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పాత్ర కీలకం

ABN , First Publish Date - 2022-11-02T22:15:52+05:30 IST

నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బంది పాత్ర కీలకమని రామగుండం పోలీసు కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్‌లో బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పాత్ర కీలకం
బ్లూకోల్ట్స్‌ సిబ్బంది శిక్షణలో మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

ఏసీసీ, అక్టోబరు 2 : నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బంది పాత్ర కీలకమని రామగుండం పోలీసు కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్‌లో బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డయల్‌ 100కు వచ్చే కాల్స్‌కు స్పందించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని చెప్పారు. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి తగు చర్యలు తీసుకొని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ అఖిల్‌ మహాజన్‌, సీసీఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌, బ్లూ కోల్ట్స్‌, పెట్రో కార్స్‌ ఇన్‌చార్జిలు, మంచిర్యాల రూరల్‌ సీఐ సంజీవ్‌, బెల్లంపల్లి ఇన్‌స్పెక్టర్‌ రాజు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T22:15:52+05:30 IST
Read more