బినామీ దందా

ABN , First Publish Date - 2022-09-29T06:00:14+05:30 IST

ప్రజాసేవా ముసు గులో ఓ మండల ప్రజాప్రతినిధి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా అవతార మెత్తి అడ్డగోలు దందాలకు ఎగబడు తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతో ఇచ్చోడ, బోథ్‌ మండలాల్లో విచ్చలవిడిగా అక్రమ లేఔట్లను ఏర్పాటు చేస్తూ..

బినామీ దందా
బోథ్‌ మండలం కుచ్లాపూర్‌లో అక్రమ లేఔట్‌ ఇదే..

బోథ్‌ మండలం కుచ్లాపూర్‌లో అక్రమ వెంచర్లు

పోలీసు సిబ్బందితో కలిసి ఓ ఎంపీపీ బినామీ దందా

హద్దురాళ్లను పాతి మరీ జోరుగా ‘రియల్‌’ వ్యాపారం

అనుమతులు లేకున్నా.. అడ్డగోలుగా ప్లాట్ల విక్రయాలు

చోద్యం చూస్తున్న జిల్లా అధికార యంత్రాంగం 

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజాసేవా ముసు గులో ఓ మండల ప్రజాప్రతినిధి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా అవతార మెత్తి అడ్డగోలు దందాలకు ఎగబడు తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతో ఇచ్చోడ, బోథ్‌ మండలాల్లో విచ్చలవిడిగా అక్రమ లేఔట్లను ఏర్పాటు చేస్తూ.. అమ్మేసుకుంటున్నాడనే ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా బోథ్‌ మండలంలోని కుచ్లాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో రహదారిని ఆనుకుని ఐదు ఎకరాల భూమిలో హద్దురాళ్లను పాతేసి అమ్మేసుకోవడంపై కొందరు స్థానికులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. తేలికగా తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  ప్రజాసేవకు అంకితమై పని చేయాల్సిన అధికార పార్టీ నేత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికే పరిమితమై ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటున్నారు. అసలు కార్యాలయానికి కూడా అడపాదడపాగా వచ్చి పోతున్నాడనే విమర్శలు లేకపోలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఎంతో ఆరితేరిన ఈ లీడర్‌ అధికారులను సైతం బెదిరింపులకు గురి చేస్తూ తన పంతం నెగ్గించుకుంటున్నట్లు తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడే నాలుగు పైసలు వెనుకేసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. అడ్డగోలుగా లేఔట్లు వేయడం, అమాయక ప్రజలకు అంటగట్టడం అలవాటుగా మారిందంటున్నారు. డబ్బులు ఉంటే చాలు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేయవచ్చనే ధీమాతో అక్రమ సంపాదనకు ఎగబడుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ దందాలను కట్టడి చేయాల్సిన ఓ బాధ్యత గల మండల స్థాయి ప్రజాప్రతినిధే అక్రమమార్గంలో అందినకాడికి దండుకోవడం ఏమిటన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించినా.. ఫలితం కనిపించడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు, నేతలకు పరోక్ష సహకారాన్ని అందిస్తూ.. తలో కొంత జేబులో వేసుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అడ్డు వస్తే బెదిరింపులే..

ఓ మండల ఎంపీపీగా కొనసాగుతున్న రియల్‌ లీడర్‌ తన దందాకు అడ్డువచ్చిన అధి కారులను బెదిరింపులకు సైతం గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏకంగా ఓ కానిస్టేబుల్‌, హోంగార్డు, మరో కల్తీ కల్లు వ్యాపారి భాగస్వామ్యంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామస్థాయి లో అడ్డంకులు వస్తే పోలీసు సిబ్బంది సహకారంతో చక్కబెడుతుం డగా.. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను రాజకీయ పలుకుబడితో తన వైపు తిప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహి తంగా ఉండే ఓ నేత తనకు దగ్గరి బంధువని చెప్పుకుంటూ.. మాట విన కుంటే వేటు తప్పదంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నట్లు చెబుతున్నా రు. రాష్ట్ర స్థాయిలో అధికారులపై ఒత్తిళ్లు చేస్తూ అడ్డదారిలో అనుమతు లు తీసుకోవడం ఆయనకు అలవాటుగా మారిందంటున్నారు. రాష్ట్రస్థా యి నేతలతో ఉన్న సంబంధాలతోనే మండలస్థాయి అధికారులు ప్రశ్నిం చేందుకు జంకుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో నియోజక వర్గ ఎమ్మెల్యేకే సవాల్‌ విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయని అధికార పార్టీ లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన రాజకీయ పలుకుబడితో ఒకరిద్దరు మండలస్థాయి అధికారులపై బదిలీ వేటు వేయించినట్లు తన సన్నిహితు ల వద్ద గొప్పలు చెప్పుకుంటున్నట్లు వినిపిస్తుంది. తన అక్రమ దందాల ను కాపాడుకునేందుకే అధికార పార్టీలో కొనసాగుతున్నాడంటున్నారు. 

గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు

బోథ్‌ మండలం కుచ్లాపూర్‌ గ్రామంలో అక్రమంగా వెంచర్‌ను ఏర్పాటు చేసిన రియల్‌ లీడర్‌, అనుమతులు రాకముందే గుట్టుచప్పుడుకాకుండా ప్లాట్లను అమ్మేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే కుచ్లాపూర్‌ పంచాయ తీ కార్యదర్శి అనుమతి లేని ప్లాట్లకు రిజిస్ర్టేషన్‌ చేయవద్దంటూ బోథ్‌ సబ్‌రిజిస్ర్టార్‌కు నోటీసులు ఇచ్చినా.. అడ్డదారిలో ప్లాట్ల రిజిస్ర్టేషన్లు మాత్రం ఆగడమే లేదు. అధికారులు కూడా అనుమతి లేదన్న సాకుతో ఒక్కో ప్లాటుకు రూ.25 నుంచి రూ.40వేల వరకు దండుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వా న్‌ భాషా జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అనుమతి లేని లేఔట్లకు రిజిస్ర్టేషన్‌ చేయవద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన బోథ్‌ రిజి స్ర్టేషన్‌ కార్యాలయంలో అక్రమదందాకు అడ్డుకట్ట పడడం లేదు. కుచ్లా పూర్‌లో ఏర్పాటు చేసినా.. లేఅవుట్‌ అనుమతుల కోసం దరఖాస్తు చేసు కున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు పేర్కొం టున్నారు. కానీ ఇప్పటికే పదుల సంఖ్యలో ప్లాట్లు అమ్మేసుకుని రిజిస్ర్టేష న్‌ కూడా చేసి కొంతసొమ్మును జేబులో వేసుకున్నట్లు తెలుస్తుంది. అను మతి లేని సంబంధిత వెంచర్లలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయక పోవడంతోనే అమాయక ప్రజలు మోసపోతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారుల మోసాలకు జనం బలవుతున్నా.. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూడడం గమనార్హం.

ప్లాట్ల విక్రయాలకు ఎలాంటి అనుమతులు లేవు

: అంజయ్య, జీపీ కార్యదర్శి, కుచ్లాపూర్‌ గ్రామం, బోథ్‌ మండలం

కుచ్లాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో రహదారిని ఆనుకుని ఉన్న లేఅవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవు. యజమాని అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. పూర్తిస్థాయి అనుమతులు రాలేవు. అను మతులు లేకుండా ప్లాట్లను విక్రయించరాదు. గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన అనుమతి లేని ప్లాట్లకు రిజిస్ర్టేషన్‌ చేయ వద్దంటూ బోథ్‌ సబ్‌రిజిస్ర్టార్‌కు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ రిజిస్ర్టేషన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి ఆధారం లేకపోవడంతో చర్యలు తీసుకోవడం లేదు. ప్లాట్ల విక్రయాలు జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 

Read more