బల్దియా నేతల బరితెగింపు

ABN , First Publish Date - 2022-10-01T06:38:25+05:30 IST

ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గెలుపొందిన కొందరు బల్దియా నేతలు బరితెగించి మరి వసూల్‌ దందాకు ఎగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో ఎక్కడైనా నూతన భవన నిర్మాణాలు జరిగితే చాలు అక్కడ గద్దల్ల వాలిపోయి బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తుం ది.

బల్దియా నేతల బరితెగింపు
ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం

భవన నిర్మాణాల వద్ద గద్దల్లా వాలిపోతున్న నేతలు

తాజాగా ఓ సూపర్‌ మార్కెట్‌ అనుమతులకు లక్షల రూపాయల్లో వసూల్‌

అడిగినంత ఇస్తే ట్రేడింగ్‌ లైసెన్స్‌ లేకుండానే వ్యాపారం

‘మామూళ్లు’గా తీసుకుంటున్న జిల్లా ఉన్నతాధికారులు!!

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గెలుపొందిన కొందరు బల్దియా నేతలు బరితెగించి మరి వసూల్‌ దందాకు ఎగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో ఎక్కడైనా నూతన భవన నిర్మాణాలు జరిగితే చాలు అక్కడ గద్దల్ల వాలిపోయి బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తుం ది. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పదవిలో ఉన్నప్పుడే నాలుగు పైసలు వెనుకేసుకోవాలన్న ఉద్దేశంతో కొందరు తీరు కనిపిస్తోంది. ము న్సిపల్‌ పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రభు త్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం లేకుండానే పోతోంది. దరఖాస్తు మొదలుకొని అనుమతులు వచ్చే వరకు అడుగడుగునా అవినీతే కనిపిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులలో విచ్చలవిడిగా వసూల్‌ దందాకు ఎగ బడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదేమిటి ఇప్పుడంతా ఆన్‌లైన్‌ విధానం ద్వారానే అనుమతులు తీసుకోవచ్చు కదా.. అనే అనుమానాలు జిల్లా ఉన్నతాధికారులకు వస్తున్నా.. మున్సిపల్‌ అధికారులపై నేతలు తీవ్రమైన ఒత్తిళ్లు చేస్తూ కావాలనే కాలయాపన చేయడంతో గత్యంతరం లేక ముడుపులు ముట్టచెప్పాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇటీవల మున్సిపల్‌ పరిధిలో వినాయక్‌చౌక్‌ నుంచి నేతాజీ చౌక్‌కు వెళ్లే మార్గంలో ఓ బఢా సూపర్‌ మార్కె ట్‌ నిర్మాణం జరిగింది. దీని అనుమతులకు కింది నుంచి పైస్థాయి వరకు ముడుపులు తీసుకుని అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం అంతా నిబంధనల ప్ర కారమే జరిగిందంటున్న జిల్లా ఉన్నతాధికారులు దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ ఫిర్యాదు లు వస్తున్నాయి. లోతుగా దర్యాప్తు జరిపితే అసలు బాగోతం బయటపడే అవకాశం ఉందంటున్నారు. స్థా నిక సంస్థల అదనపు కలెక్టర్‌ దీనిపై దృష్టి సారించాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మాట వినకుంటే కొర్రీలే..

అంతా నిబంధనల ప్రకారమే అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంటు న్న స్థానిక నేతల మాట వినకుంటే లేనిపోని కొర్రీలు పెడుతూ కాలయాపన చే స్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్న నేతల కనుసన్నల్లోనే జరగాలంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతే ఇక మేమెందుకు అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. దీంతో తమకెందుకొచ్చిన గోల అంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే అధికారులు దరఖాస్తుదారులకు అనుమతులను జారీ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ బడా సూపర్‌ మార్కెట్‌కు రూ.20 లక్షల వరకు ముడుపులు ముట్టాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తూనే ఉంది. స్థానిక నేతలతో పాటు అధికారులు, మున్సిపల్‌ స్థాయి నేతలు తలోకొంత పంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పట్ట ణంలో ఏ నలుగురు కలిసినా ఆ సూపర్‌ మార్కెట్‌ అనుమతుల గురించే చర్చించుకోవడం కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం అనుమతులను జారీ చేసేందుకు అధికారులు ప్రయత్నించినా అడ్డుపుల్ల వేస్తూ దరఖాస్తుదారులను తమదారికి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ (ఎల్‌టీపీ) లతో సంబంధాలు పెట్టుకుంటున్నా.. కొందరు అధికారులు అంతా వారి ద్వారానే తతంగం నడుపిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు నిబంధనల ప్రకారం టీఎస్‌ బీపాస్‌ ద్వారానే భవన నిర్మాణ అనుమతులను తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రజల్లో టీఎస్‌ బీపాస్‌పై ఏమాత్రం అవగాహన లేకపోవడంతో లైసెన్స్‌డ్‌ ఇంజనీర్లను సంప్రదిస్తూ అడిగినంత ముట్టచెబుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నెలల తరబడి జాప్యం చేయడం పరిపాటిగా మారింది.  లొసుగులను ఆసరాగా చేసుకుని బల్దియా నేతలు అందినకాడికి దండుకుంటున్నారు. 

అడిగినంతా ఇస్తే అంతా ఒకేనటా!

మున్సిపల్‌ పరిధిలో ఏ వ్యాపారం చేయాలన్న ట్రేడింగ్‌ లైసెన్స్‌తో పాటు అ నుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు వ్యాపారులు తమ పలుకుబడితో ట్రేడింగ్‌ లైసెన్స్‌ లేకుండానే వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. గత రెండు, మూడు నెలల క్రితమే వినాయక్‌చౌక్‌ సమీపంలో ప్రారంభమైన సూపర్‌మార్కెట్‌కు ఇప్పటి వరకు ట్రేడింగ్‌ లైసెన్స్‌లు కూడా లేవంటే పరిస్థితి ఎంత అ ధ్వానంగా ఉందో తెలుస్తూనే  ఉంది. ట్రేడింగ్‌ లైసెన్స్‌ పొందిన తర్వాతనే వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంటుంది. కానీ బల్దియా నేతలకు ముడుపులు ముట్టచెప్పిన వ్యాపారి వారి అండదండతో యథేచ్ఛగా నిత్యం రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా.. అడిగే నాథుడే కరువయ్యాడు. అసలు ని బంధనల ప్రకారం సూపర్‌ మార్కెట్‌ చుట్టు పా ర్కింగ్‌ స్థలం, ఫైర్‌ అగ్రిమెంట్‌, ఫుడ్‌సేఫ్టి, సెల్‌ట్యాక్స్‌, జీఎస్టీ, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, కమ్యూనిటీ టా యిలెట్స్‌ తప్పనిసరిగా ఉండాలి. దీని ఆదారంగానే మున్సిపల్‌ అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తారు. కానీ సూపర్‌ మార్కెట్‌ వ్యాపారి ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న సంబంధిత వసతులు లేవన్న కారణంగా తిరస్కరించడం తో అధికారులకు బల్దియా నేతల నుంచి బెదిరింపులు పెరిగిపోతున్నాయి. భవన సముదాయానికి ఎలాగో అనుమతులు తీసుకున్న వ్యాపారి ట్రేడింగ్‌ లైసెన్స్‌ లేకుండానే వ్యాపారం చేయడంపై ఉన్నతాధికారులు కూడా మాములుగానే తీసు కుంటున్నారు. వ్యాపారులకు హెచ్చరికలు చేస్తే నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని  అధికారులు వాపోతున్నారు. నేతల తీరుతో విధు లు నిర్వర్తించ లేకపోతున్నామని తీవ్ర అసంతృప్తి కి గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ము న్సి పల్‌ పాలన గాడిలో పడడం గగనంగానే క నిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-10-01T06:38:25+05:30 IST