బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-25T04:28:11+05:30 IST

బతుకమ్మ పండగను అన్నిశాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసిఅధికారులతో బతుకమ్మ పండగ నిర్వహ ణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 24: బతుకమ్మ పండగను అన్నిశాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసిఅధికారులతో బతుకమ్మ పండగ నిర్వహ ణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని చిల్డ్రన్స్‌ పార్కులో బతుకమ్మపండగతో పాటు దసరా నవరాత్రి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలిపారు. పోషణ మాసం సందర్భంగా చిరుధాన్యాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ లాంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో బతుకమ్మలను తయారు చేసి ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మండలపరిషత్‌ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచా యతీ అధికారులు, స్వయం సంఘాల సభ్యులు బతు కమ్మ పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఆడపడుచులకు అందించే బతుకమ్మచీరల పంపిణీ కార్యక్ర మం త్వరితగతిన పూర్తిచేయాలని అధికారు లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, జిల్లా పంచాయతీ అధికారిరమేష్‌,జిల్లా సంక్షేమాధి కారి సావిత్రి, సీడీపీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

వృద్దుల సంక్షేమం అందరి బాధ్యత

వృద్ధులసంక్షేమం,పోషణ అందరి బాధ్యత అని కలెక్టర్‌రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి అంతర్జాతీయ వృద్ధులదినోత్సవం వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబరు 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వఆదేశాల మేర కు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.రాష్ట్ర దివ్యాం గులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాచరణ ప్రణా ళిక ప్రకారం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అత్యవసర సేవలకోసం వృద్ధులకు హెల్ప్‌ లైన్‌ 14567ఏర్పాటు చేశామనితెలిపారు. వారోత్సవా లలో సంబంధిత సంఘాల ప్రతినిధులు, స్వచ్చంద సంఘాల ప్రతినిధులు, వయోవృద్ధులు అధిక సంఖ్య లో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Read more