పూలను పూజించే వేడుక బతుకమ్మ పండుగ

ABN , First Publish Date - 2022-09-30T03:43:40+05:30 IST

ప్రకృతిలో లభించే పూలతో పూజించే వేడుక బతుకమ్మ పండుగ అని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని రెవెన్యూ, కలెక్టరేట్‌ ఉద్యోగులతో కలెక్టరేట్‌ ఆవరణలో, అనంతరం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా వైద్యారోగ్య, పశు సంవర్ధక శాఖ మహిళా ఉద్యోగులతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

పూలను పూజించే వేడుక బతుకమ్మ పండుగ
జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు  29 :  ప్రకృతిలో లభించే పూలతో పూజించే వేడుక బతుకమ్మ పండుగ అని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని రెవెన్యూ, కలెక్టరేట్‌ ఉద్యోగులతో కలెక్టరేట్‌ ఆవరణలో, అనంతరం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా వైద్యారోగ్య, పశు సంవర్ధక శాఖ మహిళా ఉద్యోగులతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నిత్యం తలమునకలయ్యే పనులలో నిమగ్నులై ఉండే రెవెన్యూ శాఖ, కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన మహి ళా ఉద్యోగులు వేడుకలలో ఆటా పాటలతో సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమని, నూతన వస్ర్తాలు ధరించి, సేకరించిన పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారని తెలిపారు. తెలంగాణ  సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రత్యేకత సం తరించుకుందని తెలిపారు. మానవాళిని ప్రకృతికి దగ్గర చేసే కార్యక్రమం బతుకమ్మ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయ మహిళా ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-09-30T03:43:40+05:30 IST