బాసరకు నేడు ముగ్గురు మంత్రులు

ABN , First Publish Date - 2022-12-10T01:38:32+05:30 IST

ప్రతిష్ఠాత్మక బాసర ట్రిపుల్‌ ఐటీకి ము గ్గురు రాష్ట్ర మంత్రులు శనివారం వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

బాసరకు నేడు ముగ్గురు మంత్రులు
బాసర ఆర్‌జీయూకేటీ ప్రధాన భవనాలు

గత హామీలు నెరవేరేనా ?

నిర్మల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రతిష్ఠాత్మక బాసర ట్రిపుల్‌ ఐటీకి ము గ్గురు రాష్ట్ర మంత్రులు శనివారం వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గతంలో అనేక ఆందోళనలకు వేదికైన ట్రిపుల్‌ ఐటీ మంత్రి కేటీఆర్‌ వచ్చిన తర్వాత విద్యార్థులతో జరిగిన చర్చలు సఫలం అయి ఆయన సూచన మేరకు ఆందోళన విరమించారు. అటు తర్వాత కూడా ఫుడ్‌ఫాయిజన్‌ వంటి కేసులతో మళ్లీ వివాదాలు చెలరేగాయి. కాగా తాజాగా ఆర్‌జీయూకేటీ స్నాతకోత్సవం నిర్వ హిస్తున్న నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీకి మంత్రి కేసీఆర్‌ హాజరవుతున్నారు. ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండడం గమనార్హం.

హామీలు నెరవేరేనా ?

రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కే.తారకరామారావు బాసర ట్రిపుల్‌ ఐటీకి వస్తున్న నే పథ్యంలో విద్యార్థులు ఆయనపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. శనివారం ఉద యం 9 గంటలకే ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రి ట్రిపుల్‌ ఐటీకి చేరుకుంటారు. అనేక ఆందోళనల నేపథ్యంలో కేటీఆర్‌ బాసరకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీలపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా త్రిపుల్‌ఐటీలో ఉన్న విద్యా ర్థులందరికీ లాప్టాప్‌లు అందజేయడంతో పాటు యూనిఫామ్‌లు వంటి వి అందజేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇవన్నీటికి మించి విద్యార్థులకు నాణ్య మైన భోజనం కల్పించే మెస్సుల విషయం పైనే అందరి దృష్టి నెలకొంది. దీని విషయంలో మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారుతుంది. అన్నింటికన్నా ఎక్కువగా ట్రిపుల్‌ఐటీలో మెస్సుల మీదనే ఫిర్యాదు లు ఉన్నాయి. మెస్సుల నిర్వహణతో పాటు నాణ్యమైన భోజనం అందించే విషయంలో వస్తున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Updated Date - 2022-12-10T01:38:33+05:30 IST