సైన్స్‌తోనే సమాజంలో చైతన్యం

ABN , First Publish Date - 2022-11-24T22:33:54+05:30 IST

సమాజాన్ని చైతన్యవంతం చేసే ఏకైక సాధనం శాస్త్రీయత అని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం సాం ఘిక సంక్షేమ బాలికల గురుకులంలో జోనల్‌ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌-2022 కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

సైన్స్‌తోనే సమాజంలో చైతన్యం

బెల్లంపల్లి రూరల్‌, నవంబరు 24: సమాజాన్ని చైతన్యవంతం చేసే ఏకైక సాధనం శాస్త్రీయత అని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం సాం ఘిక సంక్షేమ బాలికల గురుకులంలో జోనల్‌ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌-2022 కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. శాస్త్రీయ దృక్పథమే సమాజాన్ని ఉన్న త స్థితికి తీసుకుపోతుందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందిం చడంలో గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తీసుకుంటున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురుకులాలకు ఇస్తున్న ప్రోత్సా హాన్ని అందిపుచ్చుకుంటున్న విద్యార్థులు అత్యున్నత స్థానాలకు ఎదగడం ఆనం దంగా ఉన్నదన్నారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ తొంగల సత్యనారాయణ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తమ ప్రదర్శన గురించి వివరించారు. ఏఆర్సీవో కోటి చింతల మహేశ్వరరావు, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ రాజేశ్వర్‌ నాయక్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, డీసీవో రామాల బాలభాస్కర్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా డీసీవో పోలు బాలరాజు, వివిధ గురుకులాల ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:33:54+05:30 IST

Read more