యువతకు అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2022-11-16T22:44:41+05:30 IST

ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ)పై యువతి యువకులకు బుధవారం నస్పూర్‌ కాలనీలోని సింగరేణి గార్డెన్‌లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.

యువతకు అవగాహన సదస్సు
పోస్టర్లు ఆవిష్కరిస్తున్న అధికారులు

నస్పూర్‌, నవంబరు 16 : ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ)పై యువతి యువకులకు బుధవారం నస్పూర్‌ కాలనీలోని సింగరేణి గార్డెన్‌లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీల నుంచి 400 మంది ఔత్సాహిక యువతి యువకులు ఈ అవగాహన సదస్సుకు హాజరై తమ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పథకం అవగాహన పోస్టర్లను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ఎం హరినాథ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ మహిపాల్‌ రెడ్డి, కెవిఐసి అధికారి రాజేష్‌ కుమార్‌, కెవి ఐబి అధికారి అనసూర్య, జిల్లాలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T22:44:41+05:30 IST

Read more