అట్టహాసంగా షూటింగ్‌ బాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-12-12T00:44:29+05:30 IST

జిల్లా కేంద్రంలో మొదటిసారి నిర్వహించిన జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు అట్టహాసంగా ముగిశాయి.

అట్టహాసంగా షూటింగ్‌ బాల్‌ పోటీలు
ప్రథమ స్థానంలో నిలిచిన రాజస్థాన్‌ జట్టుతో అతిథులు, అధికారులు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 11: జిల్లా కేంద్రంలో మొదటిసారి నిర్వహించిన జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. బాల బాలికల విభాగాల్లో పోటీలను నిర్వహించగా, ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లలో బాలుర విభాగంలో రాజస్థాన్‌ జట్టు, బాలికల విభాగంలో మహారాష్ట్ర జట్లు చాంపియన్‌ లుగా అవతరించాయి. కాగా ఇందులో దేశంలోని 16 రాష్ర్టాల జట్లు పాల్గొన్నాయి. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ పోటీలలో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై విజేతలకు బహుమతులను అందజేసి అభినందించారు. షూటింగ్‌ బాల్‌ రాష్ట్ర అసోసియేషన్‌ కన్వీనర్‌, డీఎస్పీ ఉపేందర్‌, రాష్ట్ర అధ్యక్షులు సాయిని రవికుమార్‌లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-12-12T00:44:29+05:30 IST

Read more