శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించండి

ABN , First Publish Date - 2022-04-24T07:27:57+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించండి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి

తానూర్‌, ఏప్రిల్‌ 23 : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలం లోని దౌల్తాబాద్‌ గ్రామంలో కార్డెన్‌సర్చ్‌ నిర్వహించారు. వేకువజామునే గ్రామాన్ని అదుపులో తీసుకొని తనిఖీ చేశారు. సరైన ద్రువీకరణ పత్రా లు లేని 63 ద్విచక్రవాహనాలు, 3 టాటా మాజిక్‌ వాహనాలు, 2 కార్లు, ఒక ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాల నియంత్ర ణకే కార్డెన్‌సర్చ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని అను మానిత వ్యక్తులు, అసాంఘిక శక్తులను పట్టుకోవడానికి కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామస్తులు కలిసి మెలసి ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు. వాహ నదా రులు తమ వాహనాలను సంబంధించి నిజ ద్రువీకరణ పత్రాలను ఎ ల్లప్పుడు వెంట ఉంచుకోవాలన్నారు. తెలియని వ్యక్తి దగ్గరి నుంచి వా హనాలను కొనుగోలు చేసేటప్పుడు అతని ఆధార్‌కార్దుతో పాటు వాహ నం యొక్క అన్ని నిజదృవీకరణ పత్రాలను సరి చూసుకోవాలని సూ చించారు. పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేయకూడదన్నారు. ఈ కార్డెన్‌సర్చ్‌లో ముథోల్‌ సీఐ వినోద్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌, ఐదుగురు ఎస్సైలతో పాటు, 60 పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-04-24T07:27:57+05:30 IST