జిల్లా చరిత్రకు అద్దం పట్టేలా వ్యాసాలు ఉండాలి

ABN , First Publish Date - 2022-04-06T03:48:57+05:30 IST

జిల్లా సమగ్ర చరిత్రకు అద్దంపట్టేలా రచయితల వ్యాసాలు ఉండాలని సీనియర్‌ జర్నలిస్టు ఎండీ మునీర్‌ పేర్కొన్నారు. జిల్లా సమగ్ర చరిత్ర రూపొందించడానికి తెలం గాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో మంగళవా రం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో రచయిత లు సమావేశమయ్యారు. సమావేశంలో మునీర్‌ మాట్లాడుతూ జిల్లా సమగ్ర స్వరూప చరిత్ర గ్రంథంలో వివిధ అంశాల్లో రచయితలు రాస్తున్న వ్యాసాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా కృషి చేయాలన్నారు.

జిల్లా చరిత్రకు అద్దం పట్టేలా వ్యాసాలు ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న మునీర్‌

ఏసీసీ, ఏప్రిల్‌ 5: జిల్లా సమగ్ర చరిత్రకు అద్దంపట్టేలా రచయితల వ్యాసాలు ఉండాలని సీనియర్‌ జర్నలిస్టు  ఎండీ మునీర్‌ పేర్కొన్నారు. జిల్లా సమగ్ర చరిత్ర రూపొందించడానికి తెలం గాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో మంగళవా రం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో రచయిత లు సమావేశమయ్యారు. సమావేశంలో మునీర్‌ మాట్లాడుతూ జిల్లా సమగ్ర స్వరూప చరిత్ర గ్రంథంలో వివిధ అంశాల్లో రచయితలు రాస్తున్న వ్యాసాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా కృషి చేయాలన్నారు. చరిత్ర రాయడంలో వాస్తవికత వివరాలు స్వీకరించాలని, అవసరమైతే వివిధ రంగాల్లో వ్యక్తులను కలిసి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు. అనంతరం జిల్లా కోర్‌ కమిటీ కన్వీనర్‌ గోపగాని రవిందర్‌ మాట్లా డుతూ అధిక సంఖ్యలో రచయితలు ఈ మహా యజ్ఞంలో పాల్గొనడం అభి నందనీయమన్నారు. రచ యితలు తమ వ్యాసాలను ఈనెల 20వ  తేదీలోపు అందజేయా లన్నారు. జిల్లా కోకన్వీనర్‌ జనార్దన్‌, గుండేటి యోగే శ్వర్‌, అల్లాడి శ్రీనివాస్‌, దండనాయకుల వామన రావు, నీలాదేవి, తోకల రాజేశంలు  రచయితలు  పాటించాల్సిన అంశాలపై  సూచనలు చేశారు. రచయితలు మలయశ్రీ, ఉమామహేశ్వర్‌, కొమ్మెర రామ్మూర్తి, రావు, బోనగిరి రాజారెడ్డి, ఇత్యాల కిషన్‌, మల్లన్న, శ్రీనాథ్‌గౌడ్‌, పెద్ది భరత్‌, సాగర్‌, వైద్య సుజాత, బొలిశెట్టి పద్మ, రమాదేవి,  పాల్గొన్నారు.  

Updated Date - 2022-04-06T03:48:57+05:30 IST