మట్కా నిర్వాహకుల అరెస్టు

ABN , First Publish Date - 2022-02-16T05:38:22+05:30 IST

మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై దారాసింగ్‌ తెలిపారు.

మట్కా నిర్వాహకుల అరెస్టు


బజార్‌హత్నూర్‌, పిబ్రవరి15: మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై దారాసింగ్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరు జిల్లాలో మట్కా రూపుమాపే దిశలో భాగంగా బజార్‌హత్నూర్‌ మండలంలో కొన్నిరోజులుగా జనార్దన్‌, నిలేష్‌, శ్రీరాంపాల్‌ మండలంలోని పలువురిని మట్కాకు బానిసలు చేస్తూ డబ్బులు ఆశచూపి మట్కాలో డబ్బులు పెట్టి ఇస్తున్నట్లు గ్రహించిన ఇంటలిజెన్స్‌ బృందం పోలీసులు మట్కా ఆడుతున్న సమయంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సూచించారు. వీరి వద్ద నుంచి రూ.4060 నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలలో పోలీసులు అమృత్‌రెడ్డి, స్వామి, సిబ్బది ఉన్నారు.

Read more