వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై నారాజు

ABN , First Publish Date - 2022-11-11T22:39:34+05:30 IST

వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతే డాదితో పోలిస్తే కొంత ఎక్కువ ప్రకటించినా రైతులు నిరాశలో ఉన్నారు. వరి, పత్తి పంటల విషయంలో అన్నదాతలు ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై నారాజు

మంచిర్యాల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతే డాదితో పోలిస్తే కొంత ఎక్కువ ప్రకటించినా రైతులు నిరాశలో ఉన్నారు. వరి, పత్తి పంటల విషయంలో అన్నదాతలు ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర రావడం లేదని కొన్నేళ్లుగా రైతులు వాపోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అంతంత మాత్రమే చెల్లిస్తుండటంతో రైతన్నలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర కంటే ప్రైవేటు మార్కెట్లో ఎక్కువ లభిస్తుండటంతో రైతులు మొగ్గు చూపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ఈ సారైనా పంటలకు కనీస మద్దతు ధర లభిస్తుందని ఊహించిన రైతన్నల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.

జిల్లాలో పంటల విస్తీర్ణం

జిల్లాలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వానాకాలం సీజన్‌లో ప్రధాన పంటల వారీగా విస్తీర్ణం, దిగుబడి వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి 1,58,142 ఎకరాలలో సాగు చేయగా 4 లక్షల 43వేల 4480 టన్నులు, వరి 1,57,588 ఎకరాలలో సాగు చేయగా 2 లక్షల 93వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కందులు 2325 ఎకరాలలో సాగు చేయగా 24,771. 15 క్వింటాళ్లు, జొన్నలు 2 ఎకరాలకు 15 క్విం టాళ్లు, మొక్కజొన్న 237 ఎకరాలకు 2,110. తొమ్మిది క్వింటాళ్లు, మిను ములు 3 ఎకరాలకుగాను 18.44 క్వింటాళ్లు, పెసలు 45 ఎకరాలకుగాను 400 క్వింటాళ్ల దిగుబడి రాగా సోయాబీన్‌ 39 ఎకరాలు, పల్లి 2 ఎక రాలలో సాగు చేశారు.

వరికి మద్దతు ధర సరిపోదు

లగిసెట్టి రాజమౌళి, రైతు గుడిపేట

కేంద్ర ప్రభుత్వం వరికి నిర్ణయించిన మద్దతు ధర ఆశాజనకంగా లేదు. పంట పెట్టుబడులకు, మద్దతు ధరకు చాలా వ్యత్యాసం ఉంది. అలాగే పత్తిపై రూ.200, కందులపై రూ.300 చొప్పున పెంచారు. జిల్లాలో అత్యధికంగా వరి, పత్తి పంటలే పండుతాయి. వాటిని విస్మరించడం ఎంతవరకు న్యాయం. జిల్లాలో గ్రేడ్‌ ఏ రకం పంట అధికంగా ఉన్నందున కనీస ధర రూ.2500కు పెంచాలి. అలాగే కామన్‌ గ్రేడ్‌ 2300, పత్తికి కనీసం రూ.7500 మద్దతు ధర చెల్లిస్తే పెట్టుబడి ఖర్చులు గిట్టుబాటవుతాయి.

సాగు ఖర్చులు పెరిగినయ్‌

మల్క తిరుపతి, రైతు గుడిపేట

సాగు ఖర్చులు విపరీతంగా పెరిగినయ్‌. ఎరువుల ధరలు ఆకాశాన్నం టుతున్నయి. కూలీల రేట్లు బాగా పెరిగినయి. ఆడవాళ్లకు రూ. 300, మగవాళ్లకు రూ. 600 చెల్లిస్తున్నాం. ఎకరా వరి సాగుకు సుమారు రూ. 25వేలు ఖర్చు అవుతుంది. ఎకరాకు గరిష్టంగా 20 క్వింటాళ్లు ధాన్యం వస్తుంది. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రూ.40వేలు మద్దతు ధర వస్తుంది. ఎకరాకు కేవలం రూ.15వేలు మిగులుతుంది. ఇంటిల్లిపాది కష్టపడుతున్నాం. కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు.

మద్దతు ధరలు ఇలా

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 2022-23 సంవత్సరానికి సంబంధించి కనీస మద్దతు ధర ఇలా ఉంది. మొత్తం 15 పంటలకు ఎంఎస్సీ నిర్ణయించింది.

గతేడాది ప్రస్తుతం

ధాన్యం రూ. 1940 రూ. 2040,

‘ఏ’ గ్రేడ్‌ రూ. 1960 రూ.2060

పత్తి మధ్యరకం రూ.5726 రూ.6080

పొడవు పింజ రకం రూ. 6025 రూ.6380

కందులు రూ. 6300 రూ.6600

జొన్నలు హైబ్రిడ్‌ రూ.2738 రూ.2970

మొక్క జొన్న రూ.1870 రూ.1962

మినుములు రూ.6300 రూ.6600

శనగ రూ.5550 రూ.5850

సజ్జలు రూ.2250 రూ.2350

రాగులు రూ.3377 రూ.3578

పెసలు రూ.7275 రూ.7755

నువ్వులు రూ.7307 రూ.7287

సోయాబీన్‌ రూ.3950 రూ.4300

పొద్దు తిరుగుడు రూ.6015 రూ.6400కు పెరిగింది.

Updated Date - 2022-11-11T22:39:38+05:30 IST