చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకుబండ్‌పై ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-09-11T04:02:38+05:30 IST

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదారాబాద్‌ ట్యాంకు బండ్‌పై ఏర్పాటు చేయాలని రాష్ట్ర రజకసంఘం గౌరవ అధ్యక్షుడు కడతల మల్లయ్య అన్నారు.

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకుబండ్‌పై ఏర్పాటు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర రజక సంఘం గౌరవ అధ్యక్షుడు కడతల మల్లయ్య

- వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర రజకసంఘం గౌరవ అధ్యక్షుడు కడతల మల్లయ్య 

రెబ్బెన, సెప్టెంబరు 10: చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదారాబాద్‌ ట్యాంకు బండ్‌పై ఏర్పాటు చేయాలని రాష్ట్ర రజకసంఘం గౌరవ అధ్యక్షుడు కడతల మల్లయ్య అన్నారు. శనివారం మండలకేంద్రంలో 37వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనమాట్లాడారు. చాకలిఐలమ్మ బడుగు, బలహీనవర్గాల కోసం ఎన లేని పోరాటం చేసిందన్నారు. జడ్పీటీసీ సంతోష్‌, వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, కార్నథం సంజీవ్‌, ఎండోమెంటు ఛైర్మన్‌ వెంకన్న పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ వర్ధంతి

ఆసిఫాబాద్‌: మండలంలోని అంకుశాపూర్‌ ఎస్సీ కాలనీలో శనివారం తెలంగాణ సాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వ హించారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆమె చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయ కులు కేశవరావు, అంజన్న, బైనబాయి,  శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు: చాకలిఐలమ్మ వర్ధంతిని శనివారం మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, చిరంజీవి, రాకేష్‌, ప్రవీణ్‌, కార్తీక్‌, రమేష్‌, రాకేష్‌, శ్రీనివాస్‌, కిరణ్‌, నరేందర్‌గౌడ్‌, జావీద్‌, జాహీద్‌, రాజన్న, మహేష్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-11T04:02:38+05:30 IST