పోలీస్‌స్టేషన్‌ తనిఖీ చేసిన ఏసీపీ

ABN , First Publish Date - 2022-10-05T04:14:58+05:30 IST

లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌, సర్కిల్‌ ఆఫీసును ఏసీపీ తిరుపతిరెడ్డి మంగళవారం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీషీట్స్‌, హిస్టరీ షీట్స్‌, సస్పెక్ట్స్‌ షీట్స్‌ లిస్టును తనిఖీ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ చేసిన ఏసీపీ
సిబ్బందితో మాట్లాడుతున్న ఏసీపీ తిరుతిరెడ్డి

లక్షెట్టిపేట, అక్టోబరు 4: లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌, సర్కిల్‌ ఆఫీసును ఏసీపీ తిరుపతిరెడ్డి మంగళవారం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.  పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీషీట్స్‌, హిస్టరీ షీట్స్‌, సస్పెక్ట్స్‌ షీట్స్‌ లిస్టును తనిఖీ చేసి వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా రౌడీషీట్స్‌లో ఎవరైనా ఉంటే ప్రపోజల్స్‌ పంపించాలన్నారు. కమ్యునిటీ  పోలిసింగ్‌లో భాగంగా గ్రామాలలో సీసీ కెమెరాల గురించి  ప్రజలకు అవగాహన కల్పించి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. ప్రజా పిర్యాదులో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, నేర దర్యా ప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం  చేసుకోవాల న్నారు. సీసీఎన్‌టీఎస్‌ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు డేటాను నమోదు చేయాలని, ఈపెట్టి  కేసులు, చాలన్స్‌ కేసులలో ఫెసియెల్‌, ఫింగర్‌ ప్రింట్స్‌లలో అవసరమని, వీటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, సమయ పాలన,  నిబద్దత కలిగి ఉండాలన్నారు. బాధితులపై మర్యాదపూర్వకంగా  మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ కరీముల్లాఖాన్‌, ఎస్సై చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.   

Read more