ప్రమాదవశాత్తు బొలెరో వాహనం దగ్ధం

ABN , First Publish Date - 2022-11-19T00:32:04+05:30 IST

మండలంలోని మాదాపూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనలో బొలెరో వాహనం దగ్ధం కాగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాదవశాత్తు బొలెరో వాహనం దగ్ధం
ప్రమాదంలో దగ్ధమవుతున్న వాహనం

సోన్‌, నవంబరు 18 : మండలంలోని మాదాపూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనలో బొలెరో వాహనం దగ్ధం కాగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఎస్సై సంతోషం రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ నుండి ఆదిలాబాద్‌ వైపు ఎంపీ 28 ఎంఈ 0009 వాహనంలో పి.మాధవరెడ్డి అనే వ్యక్తి వెళ్తుండగా మాదాపూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద ఇంజన్‌ నుంచి మంటలు చెలరేగడంతో వాహనం నిలిపి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మం టలను ఆర్పారు. ప్రమాదంలో వాహనం దగ్ధమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Updated Date - 2022-11-19T00:32:04+05:30 IST

Read more