బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-10-05T03:33:36+05:30 IST

సిర్పూర్‌(యూ) తహసీల్దార్‌గా కే.వేణుగోపాల్‌ మంగళ వారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహసీల్దార్‌ రహిమొద్దీన్‌ వాంకిడికి బదిలీ అయ్యారు

బాధ్యతల స్వీకరణ
సిర్పూర్‌(యూ)లో తహసీల్దారులను సన్మానిస్తున్న నాయకులు

సిర్పూర్‌(యూ), అక్టోబరు 4: సిర్పూర్‌(యూ) తహసీల్దార్‌గా కే.వేణుగోపాల్‌ మంగళ వారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహసీల్దార్‌ రహిమొద్దీన్‌ వాంకిడికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జైనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌ల బాధ్యతలు చేపట్టిన తహ సీల్దార్‌ కే.వేణుగోపాల్‌, బదిలీపై వెళుతున్న తహసీల్దార్‌ రహిమొద్దీన్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ మెస్రం నాగోరావును సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మెస్రం భూపతి, పెందోర్‌ నాగోరావు, నాయకులు కుమ్ర భీంరావు, తోడసం ధర్మరావు, ఆడ వెంకటేష్‌, ఆత్రం ఆనంద్‌రావు, తోడసం తిర్మన్‌రావు, కుడ్మేత విశ్వనాథ్‌ పాల్గొన్నారు.  

కెరమెరి: కెరమెరి తహసీల్దార్‌గా సాయన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్కుతన్న సమీర్‌ అహ్మద్‌ఖాన్‌ జైనూరుకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో జైనూరులో పని చేస్తున్న సాయన్న కెరమెరికి బదిలీపై వచ్చారు. 

వాంకిడి: వాంకిడి తహసీల్దార్‌గా ఎండి. రహీముద్దీన్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన మధుకర్‌ బదిలీపై వెళ్లగా ఇతని స్థానంలో  సిర్పూర్‌(యూ) తహసీల్దార్‌గా పనిచేసిన  ఇక్కడికి వచ్చారు. ఈ మేరకు డీటీ సంతోష్‌కుమార్‌  ఆయనకు బాధ్యతలు అప్పగించారు.    

Read more