అబుల్‌ కలాం సేవలు చిరస్మరణీయం: కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ABN , First Publish Date - 2022-11-11T22:46:20+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 11: భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానాఅబుల్‌ కలాంఆజాద్‌ దేశానికిచేసిన సేవలు చిరస్మరణీయ మని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీపాఠశాలలో నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవానికి ఆయన హాజరయ్యారు.

అబుల్‌ కలాం సేవలు చిరస్మరణీయం: కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 11: భారత దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానాఅబుల్‌ కలాంఆజాద్‌ దేశానికిచేసిన సేవలు చిరస్మరణీయ మని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీపాఠశాలలో నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఆజాద్‌సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం భారతరత్న బిరుదుతో సత్కరించిందన్నా రు. అదనపుకలెక్టర్లు చాహత్‌బాజ్‌పాయ్‌, రాజేశం, ఆర్‌ ఎస్సీ శ్రీధర్‌, డీఐఈవో శ్రీధర్‌, డీబీసీడబ్ల్యూవో సత్యనా రాయణరెడ్డి, ప్రిన్సిపాల్‌ పుష్పలత, సర్పంచ్‌లక్ష్మి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆసిఫా బాద్‌లోని బాబాపూర్‌ఎక్స్‌రోడ్డులో మైనా ర్టీల ఆధ్వర్యంలో అబుల్‌ కలాంఆజాద్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ఆసిఫాబాద్‌: మహిళాసంఘాలు ఆర్థికంగా ఎదగా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బజార్‌వాడీలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ.20లక్షలవ్యయంతో ఏర్పాటు చేసిన సూపర్‌మార్కెట్‌ను అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళాసంఘాలు ప్రభుత్వం అంది స్తున్న పథకాలతో ఆర్థికంగా ఎదగాలన్నారు.

Updated Date - 2022-11-11T22:46:20+05:30 IST

Read more