ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , First Publish Date - 2022-04-25T04:24:56+05:30 IST

పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఒర్రెగడ్డ పాఠశాల 1985-86 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం సీఈఆర్‌ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. మొదట పాఠశాల ప్రాంగణంలో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సీఈఆర్‌ క్లబ్‌లో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు

మందమర్రిటౌన్‌, ఏప్రిల్‌ 24: పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఒర్రెగడ్డ పాఠశాల 1985-86 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం సీఈఆర్‌ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. మొదట పాఠశాల ప్రాంగణంలో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సీఈఆర్‌ క్లబ్‌లో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 36 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో అందరు ఉత్సాహంగా గడిపారు. మృతిచెందిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటించారు.  అనంతరం గురువులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. పూర్వ విద్యార్థులు జీఎం కార్యాలయం సూపరింటెండెంట్‌ రాజలింగు, ఎన్‌పీడీసీఎస్‌ ఈవో కొండ య్య, మురళీరావు, బాబురావు, పద్మశ్రీ, రాజయ్య, శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 

ఏసీసీ: మంచిర్యాల పట్టణంలోని స్వాగత ఫ్రెడ్‌ హాల్‌లో కార్మెల్‌ కాన్వెంట్‌ హైస్కూల్‌ 1992 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వ హించారు. వారు స్ధాపించిన హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపడు తున్న కార్యక్రమాలను వివరించారు. సంస్థ సభ్యులు మాట్లాడుతూ పేదల ఉన్న త విద్య, ఆరోగ్య కోసం ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ప్రస్తుతం లక్ష రూపాయలను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. గాజుల ముఖేష్‌గౌడ్‌, సంస్థ సెక్రెటరీ సాధిక్‌పాషా, కిరణ్‌, హిందీ టీచర్‌ సఫియా, పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-25T04:24:56+05:30 IST