నీటి కోసం విద్యార్థులకు తప్పని పాట్లు

ABN , First Publish Date - 2022-08-18T04:10:46+05:30 IST

మండల కేంద్రంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠ శాలలో చేతిపంపు చెడిపోవడంతో విద్యార్థులు భోజన సమయంలో చేతులు కడుగుకోవడానికి, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా సరఫరా అయ్యే నీరు తాగరాదు అని అధికా రులు ఆదేశాలున్నాయి.

నీటి కోసం విద్యార్థులకు తప్పని పాట్లు
బకెట్లలో నీటిని తెచ్చుకుంటున్న విద్యార్థులు

దహెగాం, ఆగస్టు 17: మండల కేంద్రంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠ శాలలో చేతిపంపు చెడిపోవడంతో  విద్యార్థులు భోజన సమయంలో చేతులు కడుగుకోవడానికి, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా సరఫరా అయ్యే నీరు తాగరాదు అని అధికా రులు ఆదేశాలున్నాయి. దీంతో విద్యా ర్థులు చేసేదేమిలేక సుమారు 200 మీటర్ల దూరంలోని చేతి పంపు నీటిని బకేట్లలో నింపి తీసుకువస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి పాఠశాల ఆవరణలోని చేతి పంపును బాగుచేయించి తాగునీటి సమస్యను తీర్చాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Read more