అందని పుస్తకం

ABN , First Publish Date - 2022-07-06T04:14:50+05:30 IST

పాఠశాలలు పునఃప్రారంభమై మూడు వారాలు గడిచినప్పటికీ పాఠ్యపుస్తకాల జాడలేదు. ప్రైవేట్‌ విద్యా సంస్థలకు దీటుగా సర్కారు బడుల్లో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నా మని ఓ వైపు ప్రభుత్వం చెబుతోంది. మరో వైపు సర్కారు బడుల్లో సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు

అందని పుస్తకం
లోగో

- బోధనకు ఆటంకం

- జిల్లాకు చేరింది 50శాతమే

- ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 5: పాఠశాలలు పునఃప్రారంభమై మూడు వారాలు గడిచినప్పటికీ పాఠ్యపుస్తకాల జాడలేదు. ప్రైవేట్‌ విద్యా సంస్థలకు దీటుగా సర్కారు బడుల్లో మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నా మని ఓ వైపు ప్రభుత్వం చెబుతోంది. మరో వైపు సర్కారు బడుల్లో సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలలు తెరిచి మూడు వారాలు దాటినా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందలేదు. దీంతో బోధనకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాకు 50 శాతం పుస్తకాలే వచ్చాయి.దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 

కుమరం భీం జిల్లా వ్యాప్తంగా..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 1,127 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 903, ప్రాథమికోన్నత 111, జిల్లా పరిషత్‌, మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బా గాంధీ, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 73,318 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తోంది. జిల్లాలోని విద్యార్థులకు 5,15,433 పుస్తకా లు అవసరముండగా ఇప్పటి వరకు కేవలం 2,58,600 పుస్తకాలు మా త్రమే వచ్చాయి. ఇంకా 2,57,716 పుస్తకాలు రావాల్సి ఉంది. ఇప్పటి వర కు 1,35,205 పుస్తకాలను అయా పాఠశాలలకు పంపిణీ చేశారు. 

వచ్చింది అరకొరె..

ప్రతీ తరగతికి సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు అరకొరె జిల్లాకు చేరాయి. పదో తరగతికి సంబంధించి గణితం, హిందీ, తొమ్మిదో తరగతికి సంబంధించి భౌతిక శాస్త్రం పుస్తకాలు ఇంతవరకు రాలేదు. 8వ తరగతికి సంబంధించి ఫిజిక్స్‌, సోషల్‌, బయాలజీ, ఏడో తరగతికి సంబంధించి మాథ్స్‌, సైన్స్‌, సోషల్‌, 6వ తరగతికి సంబంధించి ఇంగ్లీష్‌, సోషల్‌, సైన్స్‌, మాథ్స్‌ సబ్జెక్టులు రాలేదు. అలాగే ఒకటి నుంచి ఐదో తరగతికి సంబంధించిన పుస్తకాలు పూర్తిగా వచ్చాయి. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్య పుస్త కాలను సమ కూర్చేవారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక హెచ్‌ఎంలు వాటిని తీసుకువెళ్లి విద్యా ర్థులకు అందించేవారు. కాగా ప్రస్తుతం పుస్తకాలు సగం వరకే రావడం తో వచ్చిన వాటిని అయా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. 

ఇంగ్లీష్‌ మీడియంతో ఆలస్యం..

- ఆశోక్‌, డీఈవో

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రారం భించాం. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడ దనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను రెండు భాషలలో ముద్రి స్తోంది. అందుకే పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్నాం.

Updated Date - 2022-07-06T04:14:50+05:30 IST