పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమజంట

ABN , First Publish Date - 2022-05-24T06:14:52+05:30 IST

కులాంతర వివాహం చేసుకుని పోలీసు స్టేషన్‌లో రక్షన కోసం వచ్చిన ప్రేమ జంటకు నిరాశ ఎదురైంది. పట్టపగలు పోలీసుల సమక్షంలో పోలీసు స్టేషన్‌ నుంచి యువతిని బలవంతంగా ఎత్తుకొని పోయి పోలీసులకు సవాల్‌ విసిరినా సంఘటన బేల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బేల గ్రామానికి చెందిన ప్రజ్వల్‌ బోదే, దహేగావ్‌ గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శనివారం బేల పోలీసు స్టేషన్‌లో బంధువుల నుంచి రక్షణ కల్పించాలని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు పోలీసు స్టేషన్‌లో చొరబడి పోలీసులు చూస్తుండగానే యువతిని బలవంతంగా ఎత్తుకొని పోయారు. స్టేషన్‌లో కేవలం నలుగురు సిబ్బంది ఉండడంతో వారు ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ విషయం అన్ని చోట చర్చనీయాంశంగా మారింది. అనంతరం జైనథ్‌ సీఐ నరేష్‌ రంగ ప్రవేశం చేసి యువతిని పోలీసుల అదుపులో తీసుకుని సఖీ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది.

పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమజంట

బేల, మే23: కులాంతర వివాహం చేసుకుని పోలీసు స్టేషన్‌లో రక్షన కోసం వచ్చిన ప్రేమ జంటకు నిరాశ ఎదురైంది. పట్టపగలు పోలీసుల సమక్షంలో పోలీసు స్టేషన్‌ నుంచి యువతిని బలవంతంగా ఎత్తుకొని పోయి పోలీసులకు సవాల్‌ విసిరినా సంఘటన బేల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బేల గ్రామానికి చెందిన ప్రజ్వల్‌ బోదే, దహేగావ్‌ గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శనివారం బేల పోలీసు స్టేషన్‌లో బంధువుల నుంచి రక్షణ కల్పించాలని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు పోలీసు స్టేషన్‌లో చొరబడి పోలీసులు చూస్తుండగానే యువతిని బలవంతంగా ఎత్తుకొని పోయారు. స్టేషన్‌లో కేవలం నలుగురు సిబ్బంది ఉండడంతో వారు ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ విషయం అన్ని చోట చర్చనీయాంశంగా మారింది. అనంతరం జైనథ్‌ సీఐ నరేష్‌ రంగ ప్రవేశం చేసి యువతిని పోలీసుల అదుపులో తీసుకుని సఖీ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. 


Read more