లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-12-09T22:59:46+05:30 IST

సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు.

లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 9: సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ గౌతమితో కలిసి గ్రామాల్లో పారిశుధ్యం, నర్సరీ, కంపోస్టు షెడ్‌లు, వంటశాలలు తదితర అంశాలపై ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలలో కేటాయించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. గ్రా మాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, రోజు తడి, పొడి, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించాలన్నారు. గ్రామపంచాయతీలలో స్వయం సహాయ సంఘాల సభ్యులు, వీవోలతో సమావేశం ఏర్పాటు చేసి చెత్త కనపడకుండా గ్రామపంచా య తీ సిబ్బంది పనులు చేసేలా కార్యదర్శులు, సర్పం చ్‌లు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తం గా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించామని, ఎవరైనా వినియోగించినట్లయితే చర్యలు తీసుకొం టామన్నారు. పాఠశాలల్లో స్థాయి నుంచి విద్యార్థు లు పారిశుధ్యం, క్రమశిక్షణ అలవర్చుకుంటే భవి ష్యత్‌ క్రమపద్ధతిలో కొనసాగుతుందని, ఉపాధ్యా యులు విద్యార్థులకు క్రమశిక్షణ అలవాటు చేయా లని, మన ఊరు, మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుధ్యం, నర్సరీ లు, పల్లెప్రకృతి వనాలపై సమీక్ష నిర్వహించి అధికా రులకు సూచనలు, సలహాలు చేశారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

దండేపల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బం దులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలె క్టర్‌ భారతిహోళికేరి సూచించారు. ధర్మరావుపేట, మ్యాదరిపేట, దండేపల్లి గ్రామాల్లో కొనుగోలు కేం ద్రాలు, ఈజీఎస్‌ నర్సరీని తనిఖీ చేశారు. ఆమె మా ట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టకుండా తూకం లో కోతలు విధించకుండా కొనుగోలు చేయాల న్నారు. నిర్వాహకులు ధాన్యంలో కోతలు విధిస్తే కఠి న చర్యలు తప్పవన్నారు. కొందరు నిర్వాహకులు 40 కిలోలకు బదులు 42 కిలోలు తూకం వేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌక ర్యాలు కల్పించి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయా లన్నారు. రైతులు కూడా ఆరబెట్టిన తర్వాతనే ధాన్యాన్ని కేంద్రానికి తీసుక వచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. దండేపల్లి, మ్యాదరిపేట గ్రా మాల్లో నర్సరీని ఆమె పరిశీలించారు. ప్రజలకు ఉప యోగ పడే నీడనిచ్చే మొక్కలకు బదులు ఇతర మొక్కలు పెంచడం ఏమిటని సిబ్బందిపై మండిప డ్డారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవన్నారు.

Updated Date - 2022-12-09T22:59:49+05:30 IST